అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలను పునరుద్ధరించేందుకు ఇరు దేశాల అధ్యక్షుల మధ్య పరస్పర అంగీకారం కుదిరినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. జపాన్ ఒసాకాలో జరిగిన జీ-20 సదస్సులో డొనాల్డ్ ట్రంప్, షీ జిన్‌పింగ్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఇక నుంచి చైనా వస్తువులపై అదనపు సుంకాలు విధించబోమని ట్రంప్ హామీ ఇచ్చినట్లు చైనా మీడియా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న చైనాకు ట్రంప్‌తో చర్చల అనంతరం కొద్దిపాటి ఉపశమనం లభించినట్లయింది.
చైనా పట్ల తనకు ఎలాంటి విరోధం లేదని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవ్వాలని ఆశిస్తున్నట్లు ట్రంప్ తెలిపారని 'జినువా' పత్రిక పేర్కొంది.
సమానత్వం, పరస్పర గౌరవమే ప్రధానంగా వాణిజ్య చర్చలు పునరుద్ధరిస్తామని చైనా తెలిపింది.
గత నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా-చైనా సంబంధాల్లో చాలా మార్పులు వచ్చినట్లు జిన్‌పింగ్ చెప్పారు. పరస్పర సహకారం ఇరు దేశాలకు లబ్ధి చేకూరుస్తుందని, విభేదాలతో నష్టపోతామని అభిప్రాయపడ్డారు.
ఇదీ వివాదం...