రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్ సమస్యను పక్కదారి పట్టించే ఆలోచనలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఆ గ్రామ సమస్య పరిష్కారం కోసం కనీస ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.
హాజీపూర్ బాధితులకు 50 లక్షల రూపాయలు సాయంతో పాటు గ్రామంలో వంతెన నిర్మించి బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు తాము వినతిపత్రాలు సమర్పించినా పట్టించుకోవట్లేదని విమర్శించారు. హాజీపూర్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
'హాజీపూర్‌లో వంతెన నిర్మించి బస్సు సౌకర్యం కల్పించాలి'
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్ ఘటనకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు వీహెచ్. గ్రామంలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
హాజీపూర్‌లో వెంటనే మౌలిక వసతులు కల్పించాలి : వీహెచ్
ఇవీ చూడండి : రామగుండం ఎన్టీపీసీ పనులు పరిశీలించిన కేసీఆర్