పదహారు స్థానాలతో దిల్లీకి వెళితే కేసీఆర్‌ను పలకరించేవారే ఉండరని దుయ్యబట్టారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి భాజపాకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. మోదీని మళ్లీ ప్రధాన మంత్రిని చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని విమర్శించారు.
జీవన్‌రెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో మలుపు: భట్టి
జీవన్‌రెడ్డి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మలుపు. ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక, అరాచక పాలనకు వ్యతిరేకంగా... కేవలం మూడు నెలల్లోనే ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. రేపు జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఇదే పునరావృతమవుతుంది. ---- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఎంఐఎం నేతల వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపాకు మద్దతు ఇస్తున్న తెరాసతో ఎంఐఎం కలసి ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తున్న కేసీఆర్‌ను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న జహీరాబాద్, వనపర్తి, హుజూర్నగర్ సభల్లో రాహుల్ పాల్గొంటారని తెలిపారు.
ఇవీ చూడండి:గాంధీభవన్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీ
Last Updated : Mar 29, 2019, 3:05 PM IST