తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సంచలనాల 'ఫన్నీగర్ల్​'కు అత్యుత్తమ పురస్కారాలు

సినీ రంగంలో రాణించాలంటే తల్లిదండ్రులకు ఆసరా ఉండాలని..లేదంటే డబ్బు, పలుకుబడి అయినా ఉండాలనుకునే వారందరికీ ఈ నటి ఓ స్ఫూర్తి. ఏడాది వయసులోనే తండ్రిని పొగొట్టుకుంది.  పేదరికం ఉన్నా తల్లి కష్టపడి పెంచింది. చివరికి ఆ అమ్మాయి  ప్రతిష్టాత్మక ఆస్కార్​, గ్రామీ, ఎమ్మీ, టోనీ అవార్డులు సొంతం చేసుకుంది. ఆమె పేరే బార్‌బ్రా స్ట్రీశాండ్‌.

చరిత్రలో సంచలనం సృష్టించిన 'ఫన్నీగర్ల్​'...పురస్కారాలతో సత్కారం

By

Published : Mar 21, 2019, 11:20 PM IST

Updated : Mar 22, 2019, 6:42 AM IST

న్యూయార్క్‌లో 1942 ఏప్రిల్‌ 24న పుట్టింది 'బార్‌బ్రా స్ట్రీశాండ్‌'. చిన్నప్పటి నుంచే గాయనిగా, నటిగా మారాలని కలలు కనేది. తన లక్ష్యం సాకారం చేసుకోడానికి లైబ్రరీలో గాయనులు, నటుల జీవిత విశేషాలను చదివేది. ఎన్నో ప్రయత్నాలు విఫలమైనా పట్టుదలతో నటననే నమ్ముకుంది. ఫలితం చరిత్రలో గాయకురాలిగా, కథానాయికగా, గీత రచయిత్రిగా, ఫిల్మ్‌మేకర్‌గా చరిత్రలో ఓ అధ్యాయాన్ని లిఖించింది.

బార్‌బ్రా స్ట్రీశాండ్‌
  • తిరుగులేని ప్రస్థానం:

ఆరు దశాబ్దాలు సినీ సంగీతంలో ఓ వెలుగు వెలిగింది బార్‌బ్రా. ఈ ప్రస్థానంలో రెండు ఆస్కార్‌ అవార్డులు, పది గ్రామీ అవార్డులు, అయిదు ఎమ్మీ అవార్డులు, ప్రత్యేక టోనీ అవార్డు, అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ అవార్డు, కెనడీ సెంటర్‌ గౌరవ పురస్కారం, నాలుగు పీబోడీ అవార్డులు సహా లెక్కలేనన్ని పురస్కారాలు సాధించింది.

గ్రామీ అవార్డు అందుకున్న బార్​బ్రా
  • సంచలన తార​:

1964 మార్చి 22న న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌లో కథనం ప్రచురితమై సంచలనం సృష్టించింది. వెండితెరపై నటిగా ‘ఫన్నీ గర్ల్‌’, ‘ద ఓల్‌ అండ్‌ ద పుస్సీక్యాట్‌’, ‘ద వే ఉయ్‌ వర్‌’, ‘ఎ స్టార్‌ ఈజ్‌ బార్న్‌’ సినిమాలతో ఆకట్టుకుంది.

గాయనిగా బార్‌బ్రా స్ట్రీశాండ్‌.
  • మిలియన్ల అమ్మకాలు:
  1. తొలి మహిళా మ్యూజిక్‌ కంపోజర్‌గా ‘ఎవర్‌ గ్రీన్‌’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.
  2. ‘యంటి’ చిత్రంతో రచయితగా, నిర్మాతగా, దర్శకురాలిగా, నటిగా...ఓ సినిమాకు పనిచేసిన తొలి మహిళగా పేరు పొందింది.
  3. ఈ చలనచిత్రానికి ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు వచ్చాయి. దర్శకత్వానికీపురస్కారం లభించడం విశేషం.
  4. గాయనిగా ఈమె ఆల్బమ్స్‌ 150 మిలియన్‌ కాపీలు అమ్ముడై సంచలనం సృష్టించాయి.

.

Last Updated : Mar 22, 2019, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details