తెలంగాణ

telangana

ETV Bharat / briefs

హోమగుండమే సింహాసనం

హోమగుండం దగ్గరకు వెళ్లాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. క్షణాల్లో పని పూర్తిచేసుకుని పక్కకు వచ్చేస్తాం. కానీ... హోమగుండమే సింహాసనం అయితే? ఏళ్ల తరబడి హోమగుండంపైనే కూర్చుంటే? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలంటే ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లాల్సిందే.

హోమగుండమే సింహాసనం

By

Published : Feb 9, 2019, 6:49 PM IST

హోమగుండమే సింహాసనం
ప్రయాగ్​రాజ్​ కుంభమేళాలో అనేకమంది బాబాలు దర్శనమిస్తున్నారు. ఒకరు ఎప్పటికీ ఒంటి కాలుపై నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తే... మరొకరు తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఒక బాబా తన 12 ఏళ్ల వయస్సు నుంచే హోమ గుండంపై కూర్చుని తపస్సు చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈయన విశ్వేశానంద. హోమగుండంపై పదునైన మేకులు ఏర్పాటు చేసి... వాటిపై కూర్చుని తపస్సు చేస్తున్నారు. బాబా గురించి తెలిసిన యాత్రికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చూడటానికి తరలివస్తున్నారు.

చిన్నతనం నుంచే దైవభక్తిలో లీనమయ్యానని, తాను కూర్చుంటున్న హోమ గుండం జీవింతాంతం వెలుగుతూనే ఉంటుందని తెలిపారు స్వామి విశ్వేశానంద గిరి. దేశం ప్రశాంతంగా ఉండాలని, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు.

"దేశంలో ధర్మంపై దాడి జరుగుతోంది. విశ్వహిందూ పరిషత్​, భజరంగ్​ దళ్,​ ఏ దళమైనా... ధర్మాన్ని మోసం చేస్తున్నారు. వీరు దేవుని ఆదేశాలను అంగీకరించట్లేదు. రాజకీయ నాయకుల ఆదేశాలనే పట్టించుకుంటున్నారు."
---- స్వామి విశ్వేశానంద, హోమగుండం బాబా

ABOUT THE AUTHOR

...view details