తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఐఫిల్​ వైపు నిరసనకారులు... అరెస్టు - paris

ఫ్రాన్స్​లో నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. ఐఫిల్​ టవర్​ వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించిన పసుపు జాకెట్​ నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మంటలు ఆర్పుతున్న సిబ్బంది

By

Published : Feb 10, 2019, 6:43 AM IST

Updated : Feb 10, 2019, 9:00 AM IST

ప్యారిస్​ వీధుల్లో నిరసనలు
ప్యారిస్​లో పసుపు జాకెట్​ నిరసనకారులు ఐఫిల్​ టవర్​ వైపు దూసుకెళ్లడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది వాహనాలకు నిప్పుపెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రంగంలోకి దిగిన అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మొదట ఛాంప్స్​ ఎలీసీస్​ ఎవెన్యూ, జాతీయ అసెంబ్లీ వద్ద ఆందోళనలు చేపట్టారు నిరసనకారులు. ఫ్రాన్స్ ప్రభుత్వం పన్ను పెంపునకు నిరసనగా మొదలైన ఆందోళనలు 13వ వారానికి చేరుకున్నాయి.

Last Updated : Feb 10, 2019, 9:00 AM IST

ABOUT THE AUTHOR

...view details