జమ్మూలో పాక్‌కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు 40 మంది సీర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా జమ్మూలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.
కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ప్రజలు. భారత్‌లోకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా గళమెత్తారు.
నిరసనల్లో భజరంగ్‌దళ్, శివసేన, డోగ్రా ఫ్రంట్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉగ్ర చర్యను ఖండిస్తూ జమ్మూకశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
పుల్వామా ఘటనను తీవ్రంగా ఖండించింది విశ్వ హిందూ పరిషత్. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు జమ్ముూకశ్మీర్ వీహెచ్‌పీ కార్య నిర్వాహకాధికారులు.
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని భజరంగ్‌దళ్ ప్రకిటించింది.
డోగ్రా సదర్ సభ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుల్చేన్ సింగ్ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పలు కశ్మీర్ పండిట్ సంస్థలు ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించాయి.