హాజీపూర్‌లో పరిస్థితిపై యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ దృష్టిసారించారు. శ్రావణి, మనీషాలను పూడ్చిపెట్టిన బావిని ఆమె పరిశీలించారు. బావిలో మరింత లోతుగా తవ్వకాలు జరపాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కేసుల్లో నిందితులను వదిలేది లేదని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి శ్రావణి, మనీషాలను చంపినట్లు నిర్ధరించిన పోలీసులు.. కల్పన అనే చిన్నారిని చంపినట్లు అనుమానిస్తున్నారు.
బావి మరింత లోతుగా తవ్వండి: యాదాద్రి కలెక్టర్ - sravani
యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో సంచలనం సృష్టించిన వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. శ్రావణి, మనీషాలను పూడ్చిపెట్టిన బావిని మరింత లోతుగా తవ్వాలని యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు.
అనితారామచంద్రన్
Last Updated : Apr 30, 2019, 12:05 PM IST