తెలంగాణ

telangana

ETV Bharat / briefs

దక్షిణాది హారర్ కామెడీ రీమేక్​లో అక్షయ్ - kanchana remake

లారెన్స్ స్వీయ దర్శకత్వం వహించిన 'కాంచన' సినిమా బాలీవుడ్​లో రీమేక్ కానుంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్నాడు.

కాంచన రీమేక్​లో నటించనున్న అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ

By

Published : Apr 3, 2019, 8:44 AM IST

దక్షిణాది సినిమాలు బాలీవుడ్​లో రీమేక్ కావడం కొత్తేమి కాదు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో చిత్రం చేరింది. తమిళంలో తెరకెక్కి తెలుగులో అనువాదమై ఘనవిజయం సాధించిన 'కాంచన'... హిందీలో రీమేక్ కానుంది. హీరో హీరోయిన్​గా అక్షయ్ కుమార్, కియారా అడ్వాణీ నటించనున్నారు.

ప్రస్తుతం కేసరి విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు అక్షయ్. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అన్ని జానర్లలో సినిమాలు చేసి విజయాల్ని అందుకున్నాడీ హీరో.

ప్రస్తుతం కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న 'గుడ్​న్యూస్'లో అక్షయ్, కియారా కలిసి నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో కరీనా కపూర్, దిల్జీత్ దోసంజ్ కనిపించనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details