హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వానికి, బోర్డు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ను తక్షణం సస్పెండ్ చేయాలని, విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరువల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారయిందని విమర్శించారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకన్నారు. వారిని అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇంటర్ బోర్డు ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్ నేతల యత్నం - inter board secreatary ashok
ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించాయి.
ఇంటర్ బోర్డు ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్ నేతల యత్నం