జీవితం ఎలా ఉండాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుందని ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అన్నారు. హైదరాబాద్లో ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం అంటూ వృత్తి జీవితంలో ఎదిగే క్రమంలో తమ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఆహారం అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ మహిళా విభాగం ఛైర్పర్సన్ సోనా ఛత్వాని పాల్గొన్నారు.
ఫిక్కీ మహిళ విభాగం కార్యక్రమానికి ఆశిష్ విద్యార్థి - ఫిక్కీ మహిళా సదస్సు
హైదరాబాద్లో ఫిక్కి మహిళా విభాగం నిర్వహించిన కార్యక్రమానికి ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేపటి పనుల కోసం నేటి నుంచే ప్రణాళిక తయారుచేసుకోవాలని, జీవితం పూర్తిగా మన నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఫిక్కీ మహిళ విభాగం కార్యక్రమానికి ఆశిష్ విద్యార్థి