తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సీఎం కార్యాలయం వద్ద కారు బీభత్సం - OLA

సీఎం కార్యాలయం వద్ద కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్​ నిద్రమత్తుతో క్యాంపు కార్యాలయం వద్ద కారు అదుపు తప్పింది. రాకపోకల విభాగిని  మధ్యలో ఏర్పాటు చేసిన గేటును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గేటు విరిగింది. కారు నుజ్జు నుజ్జు అయింది.

సీఎం కార్యాలయం వద్ద కారు బీభత్సం

By

Published : May 2, 2019, 10:00 AM IST

సీఎం కార్యాలయం వద్ద కారు బీభత్సం

బేగంపేట్ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఓలా కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారు జామున సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న కారు... క్యాంపు ఆఫీస్ వద్దకు రాగానే అదుపు తప్పి రాకపోకలు విభాగిని మధ్యలో ఏర్పాటు చేసిన గేటును బలంగా ఢీకొంది. గేటు విరిగిపోయింది. కారు ముందు బాగం నుజ్జు నుజ్జు అయింది. డ్రైవర్​తో పాటు కారులో ఉన్న మహిళలకు స్పల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్ సిబ్బంది కారును తొలగించారు. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details