తెలంగాణ

telangana

ETV Bharat / breaking-news

టెక్సాస్​లో కాల్పుల కలకలం- 20 మంది మృతి! - AMERICA

టెక్సాస్​ కాల్పులు

By

Published : Aug 4, 2019, 1:12 AM IST

Updated : Aug 4, 2019, 4:00 AM IST

03:58 August 04

మరో కాల్పుల ఘటనతో అమెరికా ఉలిక్కిపడింది. టెక్సాస్​లోని సియలో విస్టా షాపింగ్​​ మాల్​లో జరిగిన హింసాకాండకు దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులు జరిపి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది ఆగంతకులు కాల్పులకు తెగబడి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కాల్పుల శబ్దాలకు మాల్​లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.

03:43 August 04

పెరుగుతున్న కాల్పుల ఘటనలు

అగ్రరాజ్యంలో కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. గత వారం అమెరికాలోని మరో షాపింగ్​మాల్​లో కాల్పుల మోత మోగింది.అంతకు ముందే కాలిఫోర్నియాలోని ఓ ఫుడ్​ ఫెస్ట్​లో ఆగంతకుడు బులెట్లతో విరుచుకుపడ్డాడు.

02:17 August 04

కాల్పుల ఘటనపై ట్రంప్​ స్పందన...

టెక్సాస్​ కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టెక్సాస్​లోని ఓ షాపింగ్​ మాల్​లో జరిగిన ఈ ఘటనలో సుమారు 20 మంది మృతిచెందారు.

01:17 August 04

అదుపులో ముగ్గురు...

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

01:09 August 04

టెక్సాస్​లో కాల్పుల కలకలం- 20 మంది మృతి!

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్​లోని ఓ షాపింగ్​ మాల్​లో ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 20మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.  
 

Last Updated : Aug 4, 2019, 4:00 AM IST

ABOUT THE AUTHOR

...view details