యూట్యూబ్ వీడియో కోసం ఓ ప్రముఖ యూట్యూబర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వీక్షకులను ఆకట్టుకునేందుకు.. రేసింగ్ బైక్‌పై గంటకు 300 కి.మీ వేగంతో వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతడు.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యూట్యూబ్‌లో బైక్ నడుపుతూ ప్రొఫెషనల్ వీడియోలు చేసే ఆ యూట్యూబర్.. అదే టూవీలర్ ప్రమాదంలో మృతి చెందాడు. దిల్లీలో జరిగే టూవీలర్ లాంగ్ రైడ్ పోటీల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్లిన అతడు.. ఇలా ప్రమాదానికి గురయ్యాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో మృతి చెందిన యూట్యూబర్ పేరు.. అగస్త్య చౌహాన్. ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌కు చెందిన వ్యక్తి. ఇతనికి PRO RIDER 1000 అనే య్యూటూబ్ ఛానల్ ఉంది. అందులో బైక్ ఇంకా రేసింగ్‌కు సంబంధించిన వీడియోలను అగస్త్య చేసేవాడు. PRO RIDER 1000 ఛానల్‌కు లక్షల్లో సబ్స్క్రైబర్లు.. కోట్లలో వీక్షకులు ఉన్నారు. అగస్త్య.. తన వీడియోల్లో అతివేగంతో వాహనాలు నడపవద్దని హెచ్చరిక సైతం చేసేవాడు.
బైక్ ప్రమాదంలో అగస్త్య చౌహాన్ మృతి ప్రమాదం జరిగిన సమయంలో అగస్త్య.. దాదాపు గంటకు 300 కి.మీ వేగంతో బైక్‌పై ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. అగస్త్య తన గత వీడియోల్లోను గంటకు 300 కి.మీ వేగంతో ఎప్పుడూ బైక్ నడపలేదని తెలిపాడు. కానీ తొలిసారిగా అదే వేగంతో బైక్ నడిపి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో అగస్త్య హెల్మెట్ ధరించినప్పటికి.. అది పగిలిపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆగ్రా నుంచి దిల్లీ వెళ్లే యమున ఎక్స్‌ప్రెస్‌పై ఈ ఘటన జరిగింది.
నుజ్జునుజ్జు అయిన హెల్మెట్ కారుతో యువకుడ్ని ఢీకొట్టి.. 20 మీటర్లు ఈడ్చుకెళ్లిన బాలుడు..
ఓ బాలుడు కారు నడుపుతూ ఓ యువకుడ్ని ఢీకొట్టాడు. అనంతరం అతడ్ని 20 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. నేరుగా వెళ్లి ఓ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. యువకుడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న బాలుడి పక్కన.. ఓ బాలిక కూడా కూర్చుంది. వీరిద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం తర్బహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ్ టాకీస్ చౌక్ నుంచి పాత బస్టాండ్ వైపు ఈ కారు వస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వారు గట్టిగా అరిచి.. వాహనాన్ని ఆపమంటూ బాలుడ్ని హెచ్చరించారు. అయినా అతడు వినకుండా అలాగే కారును ముందుకు పోనిచ్చి.. నేరుగా ఓ స్తంభాన్ని ఢీకొట్టాడు. అనంతరం అప్రమత్తమైన స్థానికులు.. బాలుడిని కారులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.