తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాకు గర్ల్​ఫ్రెండ్​​ దొరకట్లేదు సారూ'.. ఎమ్మెల్యేకు యువకుడి లేఖ​!

ఓ యువకుడు రాసిన లేఖను చదివి కంగుతిన్నారు మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే. తనకు గర్ల్​ఫ్రెండ్​ లేదంటూ ఆ యువకుడు గోడు వెళ్లబోసుకోవడమే ఇందుకు కారణం.

girlfriend mla letter
'నాకు గర్ల్​ఫ్రెండ్స్​ దొరకట్లేదు'.. ఎమ్మెల్యేకు యువకుడి లేఖ​!

By

Published : Sep 14, 2021, 7:18 PM IST

సాధారణంగా ఏదైనా ముఖ్యమైన సమస్య ఉంటేనే ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు కూడా శాసనసభ్యుడికి తన సమస్య గురించి చెప్పుకుంటూ లేఖ రాశాడు. అయితే ఆ లేఖ చదివి ఎమ్మెల్యేనే ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ లేఖలో ఏముంది ?

మహారాష్ట్రలోని చంద్రపుర్​ జిల్లాకు చెందిన భూషణ్​ పేరిట స్థానిక ఎమ్మెల్యే సుభాష్​ ధోతేకు ఈ లేఖ అందింది. తనకు గర్ల్​ఫ్రెండ్ దొరకట్లేదని.. ఆ విషయం తలచుకుంటేనే బాధగా ఉంటోందని వాపోయాడు భూషణ్. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. యువకుడు తనను కలిస్తే అతని సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించగలనని పేర్కొన్నారు.

యువకుడి లేఖ

'తాలుకాలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ నాకు గర్ల్​ఫ్రెండ్​గా దొరకట్లేదు. ఏ అమ్మాయి నాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. గద్​చందూర్​ నుంచి రాజౌరా మధ్య రోజూ ప్రయాణిస్తుంటాను. భవిష్యత్తులో నాకు గర్ల్​ఫ్రెండ్​ దొరుకుతుందన్న నమ్మకం కూడా పోతోంది. తాగబోతులకు తప్ప నాలా ఎలాంటి చెడు అలవాట్లు లేని వాళ్లకు గర్ల్​ఫ్రెండ్స్​ దొరకట్లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న యువతులను ప్రోత్సహించండి.'

-భూషణ్​ జాంబవంత్​ రాఠోడ్​, లేఖ రాసిన యువకుడు

అయితే.. ఈ లేఖను ఆ యువకుడు నేరుగా ఎమ్మెల్యేకు పంపలేదు. ఓ కార్యకర్త ద్వారా ఈ లేఖ ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే.. యువకుడి గురించి ఆరా తీయగా ఆ పేరుతో ఎలాంటి వివరాలు లభించలేదు. దీంతో ఈ లేఖపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కేవలం అందరి దృష్టిని ఆకర్షించేందుకు గుర్తుతెలియని వ్యక్తి ఇలా చేసినట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి :క్లాస్​-12లో టాపర్​.. 'నీట్​ ఫెయిల్'​ భయంతో ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details