కొందరు యువకులు సరదా కోసం బైకులతో స్టంట్లు చేసి అబాసుపాలయ్యారు. ప్రమాదకరంగా వారు చేసిన సంట్ల కారణంగా.. ఓ స్థానికుడు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజలు.. ఆ యువకులను చితకబాదారు. ఈ ఘటన కేరళ నెయ్యర్ డ్యామ్ రిజర్వాయర్ సమీపంలో జరిగింది.
ఇదీ జరిగింది..
బైకులతో విన్యాసాలు చేయడానికి నెయ్యర్ డ్యామ్ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు కొందరు యువకులు. స్టంట్లు చేసి.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలనుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ యువకుడు బైకుతో విన్యాసాలు చేస్తుండగా.. స్థానిక ద్విచక్ర వాహనదారుడు అడ్డంగా ఉన్న అతడిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆ యువకుడి కాలు విరిగింది. మరోవైపు అక్కడికి చేరుకున్న స్థానికులు ఆగ్రహానికి గురై.. యువకులను చితకబాదారు.