పరమశివుడ్ని పెళ్లి చేసుకున్న యువతి Marriage With Lord Shiva : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాకు చెందిన ఓ యువతి పరమశివుడ్ని పెళ్లి చేసుకుంది. భగవంతుడిపై భక్తితో ఆయన్ను భర్తగా స్వీకరిచించింది. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య సంప్రదాయబద్దంగా ఈ వేడుక జరిగింది. దాదాపు నెలరోజుల పాటు పెళ్లి ఏర్పాట్లు జరగ్గా.. ఆదివారం శివుడ్ని భర్తగా స్వీకరించింది యువతి. ఈఅరుదైన పెళ్లి స్థానికంగా చర్చనీయంగా మారింది.
అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి, ఆమె తల్లిదండ్రులు.. చాలా ఏళ్లుగా బ్రహ్మ కుమారి సంస్థతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. శివుడిపై ఎంతో ఎంతో మమకారాన్ని పెంచుకున్న ఆ యువతి.. ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకు ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం వల్ల.. జీవితాన్ని పరమశివుడికి అంకితం చేయాలని.. ఆయన సన్నిధిలో బతకాలని నిశ్చయించుకుంది.
ఊరేగింపుగా వివాహవేదిక వద్దకు వస్తున్న యువతి పరమశివుడ్ని పెళ్లి చేసుకున్న యువతి కాగా ఈ పెళ్లిని సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలనుకున్నారు యువతి కుటుంబసభ్యులు. నెల రోజుల ముందుగానే వివాహ ఏర్పాట్లను ప్రారంభించారు. ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధువులందరికీ పంచారు. పెళ్లి అనంతరం భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు పరమశివుడితో యువతి పెళ్లి జరిగింది. అంతకు ముందు యువతిని బాజభజంత్రీల మధ్య వివాహవేదిక వద్దకు రథంపై ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం సుందరంగా అలంకరించిన శివలింగానికి.. పూలమాల వేసి దేవుడిని భర్తగా స్వీకరించింది యువతి.
పరమశివుడ్ని పెళ్లి చేసుకున్న యువతి పరమశివుడ్ని పెళ్లి చేసుకున్న యువతి శ్రీ కృష్ణుడిని వివాహమాడిన యువతి..
Marriage With Lord Srikrishna : గతంలో రాజస్థాన్ జైపుర్‌కు చెందిన ఓ యువతి సైతం వినూత్న వివాహం చేసుకుంది. డిసెంబరు 8వ తేదీన జైపుర్, గోవింద్‌గఢ్‌లోని నర్సింగ్‌పురా గ్రామానికి చెందిన పూజా సింగ్(30) శ్రీకృష్ణుడ్ని వివాహమాడింది. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో తన జీవితాన్ని కన్నయ్యకు అంకితం చేసింది. ఈ వివాహానికి రూ.2.5లక్షలు ఖర్చు అయిందని పూజా సింగ్ తెలిపింది. సుమారు 300 మంది అతిథులు వేడుకకు వచ్చారని వెల్లడించింది. తనకు ఎన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా.. వాటన్నింటినీ తిరస్కరించానని చెప్పుకొచ్చింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దివ్యాంగురాలైన కూతురిని శ్రీకృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసిన తండ్రి..
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ప్రత్యేకమైన వివాహం జరిగింది. ఓ తండ్రి తన దివ్యాంగురాలైన కూతురిని శ్రీకృష్ణుడికి(భగవంతుడు) ఇచ్చి వివాహం చేశాడు. బంధుమిత్రుల మధ్య హంగు ఆర్భాటాలతో వివాహ వేడుక నిర్వహించాడు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.