Young Women Killed by Family :వేరే వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, అతడితో ఫోన్లో మాట్లాడుతోందని.. ఓ 17 ఏళ్ల యువతిని గొడ్డలితో నరికి చంపారు ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరాయ్ అకిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతురాలు అదే గ్రామానికి చెందిన వేరే వర్గం యువకుడ్ని ప్రేమించింది. తరుచూ అతడితో ఫోన్ మాట్లాడుతూ, కలుస్తూ ఉండేది. ఈ విషయం ఇంట్లో తెలిసి.. ఆమెను మందలించారు కుటుంబ సభ్యులు. అయినా రహస్యంగా ప్రియుడితో ఫోన్ మాట్లాడేది మృతురాలు.
శనివారం కూడా అలాగే ప్రియుడితో ఫోన్ మాట్లాతుండగా.. ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు గమనించారు. అనంతరం ఆగ్రహానికి గురై.. యువతిని గొడ్డలితో నరికి చంపారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.
మొబైల్ కోసం ఇద్దరు సోదరుల హత్య..
Two Brothers Killed for Mobile in Panjab :మొబైల్ కోసం ఇద్దరు సోదరులను కాల్చి చంపారు కొందరు వ్యక్తులు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కిల్లి అరయావాలా ఖుర్ద్ గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్, అతడి సోదురుడ్ని.. ఫిరోజ్‌పుర్‌లోని భావ్‌దే గ్రామానికి చెందిన వ్యక్తులు కాల్చిచంపారు.