తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Young Mans Knife attack at Suryapet : సూర్యాపేటలో పట్టపగలే రెచ్చిపోయిన దుండగులు.. కత్తులతో ప్రత్యర్థిపై దాడి - young mans Knife attack at Suryapet Junction

Young Mans Knife attack at Suryapet Junction : రాష్ట్రంలో రోజురోజుకి రౌడీ మూకల అల్లర్లు మితిమీరిపోతున్నాయి. మొన్న పట్టపగలే స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్‌ కలకలం మరువక మునుపే సూర్యాపేటలో ఇలాంటి ఘటనే జరిగింది. కొందరు యువకులు కత్తులతో రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే నలుగురు యువకులు.. ప్రత్యర్థిపై దాడికి దిగారు. కత్తులతో వెంబడించి మరి కిరాతకంగా పొడిచారు. బాధితుడు చాకచౌక్యంగా వ్యహరించి పోలీసులను ఆశ్రయించాడు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 29, 2023, 3:36 PM IST

Updated : Jun 29, 2023, 4:48 PM IST

Attack by rowdy sheeters at Suryapet Junction : తెలంగాణలో రోజురోజుకి దుండగులు రెచ్చిపోతున్నారు. పోలీసులకు ఏ మాత్రం భయపడకుండా చట్టాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. మొన్న మేడ్చల్‌లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్‌ యత్నం.. అంతకు ముందు భూతగాదాలతో కొమురం భీ ఆసిఫాబాద్‌లో కత్తులు వేట కొడవళ్లతో దాడి చేసుకున్న ఘటనలు మరువక మునుపే మరో ఘటన ఇవాళ చోటుచేసుకుంది.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టపగలే కొందరు యువకులు తమ ప్రత్యర్థిపై దాడులకు పాల్పడ్డారు. కత్తులతో విరుసుకుపడ్డారు. దీనిని ప్రతిఘటించిన యువకుడు చాకచౌక్యంగా వ్యవహరించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తాళ్లగడ్డ ప్రాంతానికి చెందిన చీకూరి సంతోష్, మామిళ్లగడ్డ ప్రాంతానికి చెందిన బంటి అనే యువకుడికి మధ్య పాత కక్ష్యలున్నాయి. గతంలో బంటిపై హత్యాయత్నం చెందిన బాధితుడు ప్రస్తుతం కేసును అనుభవిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో బాధితుడైన సంతోష్ వ్యక్తిగత అవసరాల మేరకు పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే తెలంగాణ తల్లి విగ్రవం వద్దకు వెళ్లాడు. దీనిని గమనించిన ప్రత్యర్ధులు విచక్ష రహితంగా కత్తులతో పొడిచారు. వెంబడించి మరి బండరాయితో మోదారు. దీంతో బాధితుడు కేకలు వేయగా చుట్టుపక్కల జనం గుమి కూడారు. వారు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో సంతోష్‌ చాకచౌక్యంగా వ్యవహరించి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

live Video of knife attack by young mans at Suryapet Junction : జనం, ప్రత్యర్థుల నుంచి తప్పించుకొని ఓ ఆటోలో స్థానిక పోలీసు స్టేషన్‌కు చేరుకున్నాడు. దీంతో పోలీసులు ముందుగా సంతోష్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిచారు. యువకుడికి వైద్యం అందిస్తున్న డాక్టర్లు సంతోష్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అతని ఆరోగ్య పరిస్థితి అప్పుడే చెప్పాలేమని అన్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. హత్యాయత్నం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

దాడి జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దాడికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు ఎప్పుడు రద్ధీగా ప్రశాంతగా ఉండే సూర్యాపేట జంక్షన్‌లో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

బాధితుడు ఆర్తనాదాలు:నలుగురు యువకులు ఒక్కసారిగా తనపై కత్తులతో దాడి చేయడంతో యువకుడు ఆర్తనాదాలు చేశాడు. సహాయం కోసం చుట్టుపక్కల వారిని పెద్ద కేకలతో పిలిచాడు. అత్యంత రద్ధీ ప్రాంతం కావడంతో అక్కడి స్థానికులు సమయానికి వచ్చారు. దుండలను వారు ఆపే ప్రయత్నం చేయగా.. ఇంతలో బాధితుడు చాకచౌక్యంగా వ్యవహరించి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 29, 2023, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details