తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rape in the Name of Friendship : స్నేహితులతో కలిసి వచ్చినందుకు.. నమ్మించి కాటేశాడు! - స్నేహం పేరుతో వరంగల్‌లో యువతి రేప్‌

Rape of a Student in Hanamkonda : డిగ్రీ చదువుతున్న ఏడుగురు మిత్రులు కలిసి.. ద్విచక్ర వాహనాలపై ములుగు జిల్లా పర్యటనకు వెళ్లారు. అందులోని విద్యార్థినిపై కన్నేసిన ఓ విద్యార్థి.. తిరుగు ప్రయాణంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేయూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Rape
Rape

By

Published : Jul 4, 2023, 9:51 AM IST

Student Rape in Hanamkonda : స్నేహం పేరుతో ఆమె ముందు మంచివాడిలా నటించాడు. తన దుర్బుద్ధి బయటపడకుండా ఉండేందుకు.. ఆమెతో పాటు అందరితో కలిసి మెలిసి ఉన్నాడు. మనవాడేలే అనుకునేలా చేశాడు. సమయం కోసం ఎదురుచూసి.. చివరకు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆదివారం జరగగా.. సోమవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఏడుగురు విద్యార్థులు ఆదివారం రోజున ములుగు జిల్లా వాజేడు పర్యటనకు వెళ్లారు. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన విద్యార్థి, వరంగల్‌కు చెందిన విద్యార్థిని, నల్లొండ జిల్లా మునుగోడుకు చెందిన ఇద్దరు విద్యార్థినులు, ముగ్గురు విద్యార్థులు కలిసి నాలుగు ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు.

Young Man Raped Young Woman In Warangal : అక్కడ సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో రింగ్‌ రోడ్డు మీదగా హనుమకొండ జిల్లా కోమటిపల్లి దగ్గర కాసేపు ఆగి విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే వరంగల్‌కు చెందిన విద్యార్థినిని.. ఏటూరునాగారానికి చెందిన అన్వేశ్‌ అనే విద్యార్థి మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి కాస్త దూరం తీసుకువెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేసి.. అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు.

ఈ విషయం స్నేహితులకు చెప్పడంతో వారు బాధితురాలిని వరంగల్‌లోని ఆమె ఇంటికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో.. సోమవారం కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.

యువతికి లిఫ్ట్‌ పేరుతో యువకుడి లైంగిక దాడి :హైదరాబాద్​లోనూ ఇటీవల ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితకు లిఫ్ట్​ ఇచ్చి.. ఆపై లైంగిక దాడికి యత్నించాడు.అర్ధరాత్రి వేళవాహనం ఎక్కిన మహిళపై కొంతదూరం వెళ్లిన తర్వాత యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆమె ప్రతిఘటించింది. మెట్టుగూడ సమీపంలోకి వచ్చేసరికి బైక్‌పై నుంచి కిందకు దూకేసింది. దీనితో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details