తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమకు అడ్డురాని వైకల్యం- వీల్​ఛైర్​పైనే పెళ్లి

ప్రేమించిన యువతి అనుకోకుండా తన రెండు కాళ్లు కోల్పోయి దివ్యాంగురాలైంది. అయితేనేం.. ఆమెను వివాహం చేసుకుని తన ప్రేమలో నిజాయితీ ఉందని నిరూపించాడో యువకుడు. ఆమెను తన జీవిత భాగస్వామిగా అంగీకరించి నలుగురికీ ఆదర్శంగా నిలిచాడు.

Young man married his physically disabled girlfriend who is in Wheelchair
ప్రేమించిన యువతిని పెళ్లాడి.. పెద్దమనసు చాటి!

By

Published : Apr 2, 2021, 5:24 PM IST

దివ్యాంగురాలైన యువతిని వీల్​ఛైర్​లో పెళ్లాడిన యువకుడు

అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న యువతి అనుకోకుండా తన రెండు కాళ్లను కోల్పోయినప్పటికీ ఆమెను ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ప్రేమికులకు స్ఫూర్తిగా నిలిచే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

చిక్​మగళూర్​కు చెందిన మను, స్వప్న ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం వరకు ఆరోగ్యంగా ఉండే స్వప్న అనుకోకుండా కుప్పకూలిపోయింది. ఆమె రెండు కాళ్లు పనిచేయని పరిస్థితి. చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది. కాళ్లు బాగు చేయించేందుకు ఆమె తల్లిదండ్రులు కేరళ, కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో అనేక మంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది.

నగరంలోని ఓ హార్డ్​వేర్​ దుకాణంలో ప్రైవేటు ఉద్యోగిగా ఉన్న మను.. స్వప్నను చూసుకునేందుకు ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే తనను వివాహం చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, పెళ్లి ఆలోచన విరమించుకోవాలని స్వప్న మనుకు సూచించింది. అందుకు అంగీకరించని మను.. వీల్ ఛైర్లో ఉన్న ఆమెను వివాహం చేసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు.

''ఆమె కాళ్లు పోయినంత మాత్రాన ఆమెను వదిలి వెళ్లలేను. నేను ఆమెను ప్రేమిస్తున్నాను కాబట్టే వివాహం చేసుకున్నాను. 6 ఏళ్లుగా మేము ప్రేమించుకుంటున్నాం. 2 సంవత్సరాల క్రితం కాళ్లు కోల్పోయింది. నేను ఆమెతోనే ఉంటూ ధైర్యం చెప్పాను. వివాహం చేసుకున్నాను. ఏ అమ్మాయికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. నా తల్లి కూడా నాకు మద్దతు ఇచ్చింది. నా భార్యను సొంత కూతురిలా చూసుకుంటోంది.''

--మను

''నా కొడుకు ఆమెను ఇష్టపడ్డాడు. వాళ్లు సంతోషంగా ఉన్నారు. అది చాలు. నేను నా కోడలిగా అంగీకరించాను. ఆమెను నా కుమార్తెలా చూసుకుంటాను.''

--మను తల్లి

''10వ తరగతిలో ఉన్నప్పటి నుంచి మేము ప్రేమలో ఉన్నాం. నేను అతడ్ని నమ్మాను. అతను నన్ను విడిచిపెట్టడని నాకు తెలుసు. కానీ నేను అతనికి భారం కావాలనుకోలేదు. నా జీవితంపై నాకు నమ్మకం పోయింది. అటువంటి సమయంలో అతను జీవితాంతం నాతో ఉంటానని చెప్పాడు. అది నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది.''

--స్వప్న

ఇవీ చదవండి:మీ స్వీట్​హార్ట్​తో సన్నిహితంగా.. సంతోషంగా ఉండండిలా..!

'అలక' తీర్చడంలోనే ఉంది అసలైన ప్రేమ!

ABOUT THE AUTHOR

...view details