తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Selfie Craze: 140 అడుగుల ఎత్తు నుంచి పడి.. చివరకు... - సెల్ఫీ ప్రమాదం

ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ(Selfie Craze).. 140 అడుగుల ఎత్తు నుంచి పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Young man fell down off water falls
140 అడుగుల ఎత్తు నుంచి పడి బతికిన యువకుడు

By

Published : Oct 3, 2021, 2:45 PM IST

140 అడుగుల ఎత్తు నుంచి పడి.. ప్రాణాలతో బయటపడ్డాడు ఓ యువకుడు. కర్ణాటకలో జరిగిందీ ఘటన. బెళగావి జిల్లాలో గోకక్ తాలూకాలోని ఘటప్రభా నదిపై ఉన్న గోకక్ జలపాతం​ వద్ద ఓ యువకుడు తన ఫోన్‌లో సెల్ఫీ(Selfie Craze) తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ పడిపోయాడు. బాధితుడిని ప్రదీప్ సాగర్‌గా గుర్తించారు అధికారులు.

140 అడుగుల ఎత్తు నుంచి పడి.. బతికిన యువకుడు

ఇదీ జరిగింది

ప్రదీప్​ సాగర్​.. బెళగావిలో ఓ ప్రవేటు బ్యాంకులో పని చేస్తున్నాడు. శనివారం స్నేహితులతో సరదాగా జలపాతం సందర్శనకు వెళ్లిన ప్రదీప్​.. ఓ రాయిపై నిలబడి సెల్ఫీ(Selfie Craze) తీసుకోబోయాడు. ఈ క్రమంలోనే కింద పడిపోయాడు. వెంటనే అతని స్నేహితులు గోకక్​ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి వరకు ప్రదీప్​ జాడ తెలియలేదు. దీంతో అతడు చనిపోయి ఉంటాడని భావించారు.

తెల్లవారుజామున ఘటనా స్థలానికి వెళ్లిన సిబ్బంది
ఘటనా స్థలంలో అధికారులు

అయితే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రదీప్​ తన స్నేహితులకు ఫోన్ చేసి.. తాను ఉన్న లొకేషన్​ షేర్​ చేశాడు. దీంతో గోకక్​ సామాజిక కార్యకర్త ఆయుబ్​ ఖాన్​కు ఈ సమాచారం అందించారు.​ గోకక్​ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఆయూబ్​ ఖాన్​.. ప్రదీప్​ ఉన్న ప్రదేశానికి చేరుకుని రక్షించారు. గాయపడిన ప్రదీప్​ను గోకక్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి:కారులో మంటలు- మాజీ సీఎం కుమారుడు సజీవ దహనం

ABOUT THE AUTHOR

...view details