తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2021, 4:14 PM IST

Updated : Aug 8, 2021, 5:31 PM IST

ETV Bharat / bharat

ఆ హోదా తనకొద్దని సీఎంకు యడ్డీ వినతి

తనకు కేబినెట్​ హోదాను కేటాయిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప కోరారు. తనకు మాజీ ముఖ్యమంత్రులకు ఉండే వసతులు మాత్రమే కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

yediyurappa
యడియూరప్ప

తనకు కేబినెట్​ ర్యాంకు వసతులు కేటాయిస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బవసరాజ్​ బొమ్మైను ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప ఆదివారం కోరారు. ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు.

"తాజా మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే వసతులను మాత్రమే నాకు కల్పించాలని మిమ్మల్ని(సీఎంను) కోరుతున్నాను. నాకు ఇచ్చిన కేబినెట్ ర్యాంకు హోదాను ఉపసంహరించుకోండి."

-యడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

యడియూరప్పకు మంత్రులకు ఉండే వసతులు కల్పిస్తున్నట్లు బసవరాజ్​ బొమ్మై శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

జులై 26న తన రెండేళ్ల పాలన పూర్తైన వేళ.. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్ప రాజీనామాచేశారు. ఆ మరుసటి రోజున బసవరాజ్​ బొమ్మై పేరును భాజపా శాసనసభాపక్ష నేతగా యడియూరప్ప ప్రతిపాదించారు. అనంతరం జులై 28న బసవరాజ్​ బొమ్మై.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే 29 మంది సభ్యులతో ఆయన మంత్రివర్గవిస్తరణ చేశారు.

ఇదీ చూడండి:నాలుగు సార్లు సీఎం.. కానీ ఎన్నడూ ఐదేళ్లు ఉండలేదు

Last Updated : Aug 8, 2021, 5:31 PM IST

ABOUT THE AUTHOR

...view details