తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్టోబర్ 8న 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

సందర్శకులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామోజీ ఫిల్మ్​ సిటీ మళ్లీ తెరుచుకోనుంది. అక్టోబర్ 8 నుంచి పర్యటకులను అనుమతించనున్నారు. సందర్శకుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. కొవిడ్​-19 మార్గదర్శకాలను పాటించేలా నిర్వహకులు అన్ని జాగ్రతలు తీసుకుంటున్నారు.

World's Largest Film City to reopen on October 8
'రామోజీ ఫిల్మ్ సిటీ' అక్టోబర్ 8న రీఓపెన్

By

Published : Sep 30, 2021, 7:30 PM IST

అక్టోబర్ 8 నుంచి 'రామోజీ ఫిల్మ్ సిటీ' రీఓపెన్

ప్రపంచంలోనే అతి పెద్ద చిత్ర నగరిగా గిన్నిస్​ వరల్డ్​ రికార్డుల్లోకి ఎక్కిన రామోజీ ఫిల్మ్​ సిటీ (Ramoji Film City hyderabad).. సందర్శకుల కోసం అక్టోబర్ 8న తిరిగి తెరుచుకోనుంది. అన్ని ఎంటర్​టైన్​మెంట్ జోన్లలో కరోనా నియమాలను పక్కాగా అమలు చేస్తున్నారు. పర్యటకులు భౌతిక దూరం పాటిస్తూ.. తమ వెకేషన్​ను జాలీగా ఎంజాయ్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. (Ramoji Film City open or not)

సుమారు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అద్భుత పర్యటక ప్రదేశం(Ramoji Film City) ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. నిరంతరం చిత్రీకరణలు జరుపుకొనే రామోజీ ఫిల్మ్​ సిటీలో.. షూటింగ్​ స్పాట్లు, నందనవనాలు, లైవ్​ షోలు, ప్లే కోర్టులు, థ్రిల్​కు గురిచేసే సాహస్​ అడ్వెంచర్​ ల్యాండ్​, బాహుబలి సెట్లు మిమ్మల్ని మైమరిచిపోయేలా చేస్తాయి.

ఫిల్మ్ సిటీలో ఆకర్షణీయమైన ఫౌంటెయిన్

ఒక్కసారి కుటుంబసమేతంగా వీక్షించి.. మీ హాలిడేను చిరస్మరణీయంగా మలచుకోండి.

బాహుబలి సెట్

1. స్టూడియో టూర్

స్టూడియో టూర్​తో అద్భుత ఊహా లోకంలో ఆనందంగా గడపండి. వింటేజ్ బస్సుల్లో ప్రయాణిస్తూ రోజంతా అద్భుత ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదించండి. సినిమా సెట్టింగ్​లు, సుందరమైన ఉద్యానవనాలు, మనసును ఆహ్లాదపరిచే లొకేషన్లు సందర్శిస్తూ.. విభిన్న వినోదంతో మీ హాలిడేను చిరస్మరణీయం చేసుకోండి.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాలు

2. యురేకా

రెప్పపాటులో వేరే యుగానికి, టైమ్​ జోన్​లోకి వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఫిలింసిటీలో యురేకాను ఒక్కసారైనా మీరు సందర్శించాల్సిందే. రాజుల కాలాన్ని తలపించే కోటలు, మొగలుల వైభవం, మౌర్యులు శౌర్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాలు ఆకట్టుకుంటాయి. అమెరికన్​ వైల్డ్ వెస్ట్​ అందాలతో వినూత్న అనుభవాన్ని పొందుతారు. ఆటపాటలు, ప్లే కోర్టులు, థీమ్డ్​ రెస్టారెంట్లు, మధ్యయుగాన్ని తలపించే మీనా బజార్‌ విశేషంగా ఆకర్షిస్తాయి.

3. లైవ్​ షోలు

రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించే లైవ్​ షో రంగుల వినోదాన్ని అస్సలు మిస్​ కావద్దు. అదిరే కొరియాగ్రఫీతో చేసే లైవ్​ డాన్స్​ షోలు, యాక్షన్​ ప్యాక్డ్​ వైల్డ్​ వెస్ట్ స్టంట్ షో చూస్తే వారెవా అంటారు. కళాకారుల ఆన్​ స్టేజ్ లైవ్​ పెర్ఫామెన్స్​కు యానిమేషన్​ కలిపి చేసే బ్లాక్​లైట్​ షో మరో హైలైట్.

4. రామోజీ మూవీ మ్యాజిక్​

ఫిలిం​ మేకింగ్​లో చిట్కాలు తెలుసుకోవాలా? అయితే రామోజీ మూవీ మ్యాజిక్​కు వచ్చేయండి. ఈ అద్వితీయ ఇంటరాక్టివ్ షోలో మీరు అంతరిక్ష నౌక ఎక్కొచ్చు. గెలాక్సీలో ప్రయాణించిన అనుభూతి పొందొచ్చు. ఫిల్మీ దునియాలో డార్క్​ రైడ్​తో ఫాంటసీ ప్రపంచాన్ని ఆస్వాదించొచ్చు. పౌరాణిక అల్లాదీన్ ప్యాలెస్, ప్రపంచ వింతలతో ఊహల్లో విహరించొచ్చు.

5. చిల్డ్రన్స్​ అట్రాక్షన్​

రామోజీ ఫిలిం సిటీలోని ఎక్స్​క్లూజివ్​ ప్లే జోన్లు పిల్లలను విశేషంగా అలరిస్తాయి. భారీ సైజులో ఉండే బోర్డుపై స్నేక్స్ అండ్ లాడర్ గేమ్ ఆడడం సరికొత్త అనుభూతినిస్తుంది. 'దాదాజిన్​'తో కలిసి ప్రత్యేక ఎంటర్​టైన్​మెంట్​ జోన్​లో​ థ్రిల్లింగ్, ఫన్ రైడ్స్, గేమ్స్ మరో హైలైట్. రెయిన్ డాన్స్, డోమ్ థియేటర్ షో చిన్నారులను మైమరిపిస్తాయి.

6. బోరాసురా

బోరాసురా.. ఓ మాయాలోకం. ఎటుచూసినా సస్పెన్స్​, థ్రిల్లింగ్ విషయాలే. సందర్శకులను భయపెట్టే మిస్టరీ దృశ్యాలు, వింత శబ్దాలతో రూపొందించిన ఈ మెజీషియన్​ వర్క్​షాప్​ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

7. బాహుబలి సెట్లు

భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించిన బాహుబలి అనుభూతిని ప్రత్యక్షంగా పొందాలా? అందుకు రామోజీ ఫిలిం సిటీ విజిట్ ఏకైక అవకాశం. దాదాపు 600 రోజులకుపైగా ఈ సినిమా చిత్రీకరణ ఇక్కడే జరిగింది. మాహిష్మతీ సామ్రాజ్యంలోని సుందర రాజప్రసాదాలు, అద్భుత ఆలయాల మధ్య మీరు సరదాగా విహరించొచ్చు.

8. ఎకో టూర్​

ఎకో టూర్​ ద్వారా ప్రకృతి వైవిధ్యాన్ని ఆస్వాదించండి. పచ్చని పందిరి కింద ఉన్న బర్డ్ పార్క్​ వివిధ ఖండాలకు చెందిన పక్షులకు నిలయం. అన్యదేశ జాతులు, రంగులు కలిగిన అద్భుతమైన బటర్​ఫ్లై పార్కును సందర్శించి మైమరిచిపోండి. సీజనల్​, శాశ్వత మొక్కల అద్భుత కూర్పు బోన్సాయ్​ పార్కును వీక్షించండి.

9. సాహస్​ అడ్వెంచర్ ల్యాండ్​

వినోదంతోపాటు కాస్త సాహసమూ ఉంటే బాగుంటుంది కదూ! ఆసియాలోనే అందుకు అత్యుత్తమ వేదిక.. రామోజీ ఫిలిం సిటీలోని సాహస్​. అన్ని వయస్కుల వారిని థ్రిల్ చేస్తుంది సాహస్. రోప్ కోర్స్, నెట్​ కోర్స్​, ఏటీవీ రైడ్​, మౌంటెయిన్​ రైడ్​, పెయింట్​బాల్, షూటింగ్​, జార్బింగ్, బంగీ ఎజెక్షన్​ వంటి యాక్టివిటీలు సాహస్​ హైలైట్స్​.

ఇలా ఎన్నో వినోదాలు, వింతలు, విశేషాలకు నిలయమైన రామోజీ ఫిలిం సిటీకి మీ ఆప్తులతో వచ్చి.. మరిచిపోలేని అనుభూతిని పొందండి.

ఇదీ చదవండి:Ramoji film city : రామోజీ ఫిలింసిటీకి పర్యాటక పురస్కారం

ABOUT THE AUTHOR

...view details