తెలంగాణ

telangana

మహిళా హక్కుల కార్యకర్త కమలా భసీన్ కన్నుమూత

By

Published : Sep 26, 2021, 6:21 AM IST

మహిళా హక్కుల కార్యకర్త, ప్రముఖ కవయిత్రి కమలా భసీన్​(Kamla Bhasin Death) ఇక లేరు. క్యాన్సర్​తో పోరాడుతూ.. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు.

Kamla Bhasin
కమలా భసీన్

మహిళా హక్కుల కార్యకర్త, ప్రముఖ కవయిత్రి.. రచయిత కమలా భసీన్‌ (75)​(Kamla Bhasin Death) క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం.. దిల్లీలోని సిటీ ఆసుపత్రిలో కన్నుమూశారు. భారత్‌తోపాటు ఇతర దక్షిణాసియా దేశాల్లో జరిగిన మహిళా ఉద్యమాల్లో తన గళం వినిపించడం ద్వారా ఈమె కీలకపాత్ర పోషించారు. 'మహిళా ఉద్యమాలకు ఇది పెద్ద లోటు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె​(Kamla Bhasin Death) తన జీవితాన్ని హుందాగా గడిపారు' అంటూ సహ కార్యకర్త కవితా శ్రీవాస్తవ ట్విటర్‌లో సంతాపం తెలిపారు.

'ఆజాదీ' వేదిక మీద నుంచి కమలా భసీన్‌ చేసిన ప్రసంగాలు దేశమంతా ప్రతిధ్వనించి, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మహిళల్లో స్ఫూర్తి నింపాయి. "భారత మహిళా ఉద్యమాల్లో కమలా భసీన్‌ దిగ్గజం. ఆమె మనందరిలో స్ఫూర్తి నింపుతూనే ఉంటారు" అని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోదియా ట్వీట్‌ చేశారు. "పలు సంస్థలకు సాయం చేసిన ఆమె సంఘ సేవకురాలు కూడా" అంటూ ట్విటర్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సంతాపం తెలిపారు. "పలు తరాలకు స్ఫూర్తిఫ్రదాత" అని సామాజిక కార్యకర్త హర్ష్‌ మందర్‌ వ్యాఖ్యానించారు. "మహిళా సాధికారత.. అక్షరాస్యతకు ఆమె నాయిక" అని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మహిళలు, బాలల హక్కులకేదీ భరోసా?

ABOUT THE AUTHOR

...view details