తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకిల్​పై ఒంటరిగా 22 దేశాల టూర్.. అదే లక్ష్యం అంటున్న అరుణిమ - కేరళ మహిళ 22దేశాల సైకిల్ యాత్ర న్యూ్స్

కేరళకు చెందిన ఓ యువతి భారీ సాహస యాత్ర చేపట్టింది. ఒంటరిగా 22 దేశాలను సైకిల్​పై చుట్టొచ్చే పని ప్రారంభించింది.

Women can achieve everything; 23-year-old girl on a cycle expedition to 22 countries
22దేశాలను సైకిల్​పై చుట్టి రావాలనే లక్ష్యంతో అరుణిమ(23)

By

Published : Nov 24, 2022, 6:12 PM IST

సైకిల్​పై ఒంటరిగా 22 దేశాల టూర్.. అదే లక్ష్యం అంటున్న అరుణిమ

కేరళ మలప్పురానికి చెందిన అరుణిమ(23) అనే యువతి ఒంటరిగా సైకిల్​పై 22 దేశాలు చుట్టొచ్చేందుకు బయలుదేరింది. 25వేల కిలోమీటర్ల సాహస యాత్రను రెండు సంవత్సరాలలో పూర్తిచేసే లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. స్వస్థలం నుంచి ఇటీవల ముంబయికి సైక్లింగ్ మొదలుపెట్టింది. ముంబయి నుంచి విమానంలో ఒమన్​ చేరుకోనుంది. అక్కడి నుంచి వివిధ దేశాలకు సైకిల్​పై వెళ్లనుంది. చివరి గమ్యంగా ఆఫ్రికన్ ఖండాన్ని చేరుకొనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది అరుణిమ.

కుటుంబ సభ్యుల మద్దతుతో ముందుకు సాగుతున్న అరుణిమ
లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో అరుణిమ

ఈ ఒంటరి ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సిద్ధమని అంటోంది అరుణిమ. "ప్రయాణంలో గుడారాలలో సేదతీరి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుందామనే ఆలోచనతో ఉన్నా" అని తెలిపింది. 'మహిళలు ఏదైనా సాధించగలరు' అని నిరూపించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించింది.

అరుణిమ
అరుణిమ

ఇలా ఒంటరిగా సాహస యాత్రలు చేయటం కేరళ మహిళలకు కొత్తేం కాదు. ఇటీవల ఓ యువతి కూడా ఫిఫా వరల్డ్​కప్​ మ్యాచ్ చూసేందుకు జీప్​లో కేరళ నుంచి ఖతర్​కు ఒంటరిగా పయనమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details