తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై 158 రోజుల పోరాటం- ఎట్టకేలకు మహిళ విజయం - 104రోజులపాటు వెంటిలేటర్​పై మహిళ

Covid 158 days in hospital: ఆ మహిళ మనోబలం ముందు కరోనా మహమ్మారి తోక ముడిచింది. ఏకంగా 158 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దాంతో ఆమెను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

Women beat Covid-19
158 రోజులపాటు కరోనాతో పోరాడిన మహిళ

By

Published : Dec 8, 2021, 1:57 PM IST

Updated : Dec 8, 2021, 4:28 PM IST

Covid 158 days in hospital: కరోనాను ఎదుర్కోలేక ప్రాణాలు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. కానీ, కొందరు మాత్రం వైరస్ ఎంత ఇబ్బంది పెట్టినా.. తమ సంకల్ప బలంతో పోరాడి గెలిచారు. అలాంటి వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన గీత. 158 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె కరోనా నుంచి కోలుకుని, ఇంటిబాట పట్టారు.

గీతకు చికిత్స అందించిన వైద్యులు
ఆస్పత్రిలో గీత

104 days on ventilator: కొప్పాలా జిల్లా బొద్దూర్​ గ్రామానికి చెందిన 45 ఏళ్ల గీతకు ఈ ఏడాది జులైలో కొవిడ్ సోకినట్లు తేలింది. దాంతో ఆమె జులై 13న జిల్లా ఆస్పత్రిలో చేరారు. కొవిడ్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు 90శాతం వరకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆమెను వైద్యులు 104 రోజులపాటు వెంటిలేటర్​పై ఉంచి, చికిత్స అందించారు. సుదీర్ఘ చికిత్స అనంతరం.. ఆమె కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మంగళవారం ఆమెను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు.

Last Updated : Dec 8, 2021, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details