కేరళ కోజికోడ్ జిల్లాలో దారుణం జరిగింది. ఐస్‌క్రీమ్‌లో విషం కలిపి 12 ఏళ్ల బాలుడిని చంపింది ఓ మేనత్త. ఈ ఘటన ఆదివారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన అన్న భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆమెను చంపాలనుకుంది. కానీ, ఆమె కోసం తెచ్చిన ఐస్‌క్రీమ్ తిన్న బాలుడు.. తీవ్ర అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తహీరా(38) అనే మహిళ అరిక్కుళం అనే గ్రామంలో నివాసం ఉంటోంది. ఈమె ఇంటి సమీపంలోనే తన సోదరుడు మహ్మద్ అలీ.. భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. అయితే, తహీరాకు తన వదినతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ కారణంగా తన అన్న భార్యను ఎలాగైనా చంపాలనుకుంది తహీరా. అనుకున్నదే తడవుగా వదినను చంపడానికి ప్లాన్ చేసింది. ఆహారంలో విషం కలిపి హత్య చేయడానికి నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఓ దుకాణానికి వెళ్లి ఐస్‌క్రీమ్‌తో పాటు విష పదార్థాన్ని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన దృష్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
విషం కొనుగోలు చేస్తున్న మహిళ ఐస్‌క్రీమ్‌లో విషం కలిపిన తహీరా.. సోదరుడి భార్యకు తినిపించాలని ఆమె ఇంటికి వెళ్లింది. ఆమె లేకపోవడం వల్ల ఐస్‌క్రీమ్ అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఇంట్లో బాలుడు ఒక్కడే ఉండటం వల్ల.. ఆ ఐస్‌క్రీమ్‌ను తిన్నాడు. అనంతరం వాంతులు చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు బాలుడికి మేపయ్యూరులోని ఓ క్లినిక్‌లో చికిత్స అందించారు. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల కోయిలాండి తాలూకా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అక్కడి నుంచి కాలికట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం బాలుడు మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసలు దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెతో పాటు పలువురిని విచారించారు. నిందితురాలు నేరం అంగీకరించిందని చెప్పారు. అయితే, ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోందని తెలిపారు. ఆరోగ్యశాఖ, ఆహార భద్రత విభాగం, ఫోరెన్సిక్ విభాగం అధికారులు ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసిన దుకాణం నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షించారు. బాలుడి శరీరంలో అమ్మోనియం ఫాస్పరస్ ఆనవాళ్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది.
భర్తను హత్య చేసిన భార్య..
ఓ భార్య తన భర్తను కిరాతకంగా హత్య చేసింది. పాయిజన్‌ను భర్త ఆహారంలో కలిపి ఈ దారుణానికి పాల్పడింది. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. అయితే, ఈ హత్యకేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ మహిళ ఎందుకు తన భర్తను చంపిందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.