తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కట్టుకున్న భార్యపై స్నేహితులతో కలిసి గ్యాంగ్​ రేప్​ - గ్యాంగ్​ రేప్​

అదనపు కట్నం కోసం భర్త పశువులా మారాడు. కట్టుకున్న భార్యపై తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. చివరకు భర్త చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

gang raped
గ్యాంగ్​ రేప్​

By

Published : Jul 23, 2021, 8:25 AM IST

ఉత్తర్​ప్రదేశ్​, కన్నౌజ్​ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. తన స్నేహితులతో కలిసి కట్టుకున్న భర్తే.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అదనపు కట్నం కావాలని చిత్రహింసలు పెట్టాడు. అంతేగాక ఆమెకు తలాక్​ చెప్పాడు.

ఏం జరిగిందంటే?

కన్నౌజ్​ జిల్లా, గుర్షాయ్​ ఘంజ్​కు చెందిన ఓ యువతికి.. అదే ప్రాంతానికి చెందిన నజీమ్​తో వివాహమైంది. పెళ్లైన కొన్నిరోజుల తర్వాత అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు నజీమ్​. అంతేకాక తన స్నేహితులు.. జుల్​ఫికర్​, జబ్బార్​, సాజిమ్, అమీర్​లతో కలిసి 15 రోజులపాటు భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎలాగోలా భర్త చెరనుంచి తప్పించుకున్న బాధితురాలు.. జరిగిన విషయాన్ని తన కుటుంబసభ్యులకు వివరించింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి:జీన్స్​ వేసుకుందని బాలికను చంపేసిన కుటుంబీకులు

ABOUT THE AUTHOR

...view details