Tomato kills woman: మహారాష్ట్ర ముంబయిలోని పాస్కల్ వాడీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ టమాట తిని ప్రాణాలు కోల్పోయింది. ఆ టమాటలో విషం ఉండటమే అందుకు కారణం. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఒంటి నిండా విషం వ్యాపించిందని డాక్టర్లు తెలిపారు. శనివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టమాట తిని మహిళ మృతి... అదే కారణం! - మహారాష్ట్ర ముంబయి వార్తలు
Tomato kills woman: టమాట ఓ మహిళ ప్రాణాలు తీసింది. అప్పటివరకు టీవీ చూస్తూ గడిపిన ఆమె ఓ టమాట తినేసరికి విగత జీవిగా మారిపోయింది. ఈ ఘటన ముంబయిలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
టమాట
ఎలుకను చంపాలని ట్రై చేసి:
నిజానికి ఆ టమాటలో విషం ఎక్కించింది కూడా ఆ మహిళే. ఎలుకను చంపాలన్న ఉద్దేశంతో ఆ టమాటలోకి మందును ఎక్కించింది. అయితే కాసేపటికి టీవీ చూడటంలో లీనమైన ఆమె ఆ టమాటలో విషం ఉందన్న సంగతి మర్చిపోయింది. ఈ క్రమంలో ఆ విషం ఉన్న టమాటానే తినేసింది. ఆ తర్వాత అసలు విషయం గ్రహించిన మహిళ ఆస్పత్రికి చేరినా అప్పటికే విషం శరీరం అంతా వ్యాపించింది.
ఇదీ చూడండి :బాలుడి ప్రయోగం.. యూట్యూబ్ చూసి మద్యం తయారీ.. స్నేహితుడికి తాగించగానే..