కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఉత్తర్ప్రదేశ్లో కర్ఫ్యూను మే 17 వరకు పొడిగించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అయితే వ్యాపారుల వినతి మేరకు ఈసారి పలు చోట్ల మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో వారం రోజులుగా మద్యానికి దూరమైన మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు.
కొవిడ్ కట్టడి కోసం మే 3 నుంచి ఆంక్షలు అమలు చేస్తోంది యూపీ ప్రభుత్వం. ఆ తర్వాత మే 6 నుంచి 10 వరకు కర్ఫ్యూ కొనసాగించింది. తాజాగా మరో వారం రోజులు పొడిగించి మే 17 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. వారణాసి గౌతంబుద్ధనగర్ సహా ఇతర ప్రాంతాల్లో ఈసారి మద్యం దుకాణాలు తెరిచేందుకు అంగీకరించింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు డైరీలు, కూరగాయల మార్కెట్లు, బేకరీలు, మిఠాయి దుకాణాలు తెరిచి ఉంటాయి.