రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ (Rakesh tikait latest news) సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీ సరిహద్దుల (Delhi border news) నుంచి రైతులను బలవంతంగా వెనక్కి పంపించాలని చూస్తే.. ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటినీ ధాన్యం మార్కెట్లుగా మారుస్తామని హెచ్చరించారు.
గాజీపుర్, టిక్రీ సరిహద్దుల్లో పోలీసులు బారికేడ్లను తొలగించిన నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.
''సరిహద్దుల నుంచి రైతులను బలవంతంగా తొలగించే ప్రయత్నాలు ఏమైనా జరిగినట్లయితే.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ధాన్యాగారాలుగా మారుస్తాం.''
- రాకేశ్ టికాయిత్, రైతు సంఘం నేత
అధికారులు.. జేసీబీలతో రైతు శిబిరాలను పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసిందని, అదే నిజమైతే పోలీస్ స్టేషన్లు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో టెంట్లు ఏర్పాటు చేసుకుంటామని టికాయిత్ (Rakesh tikait latest news) స్పష్టం చేశారు.
ఏడాదిగా మూతపడిన దిల్లీ- ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దును(Delhi border news) అధికారులు శుక్రవారం తెరిచారు. గాజీపుర్‌లోని సరిహద్దును (Barricades removed at ghazipur border) పునరుద్ధరించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు అందిన నేపథ్యంలో బారికేడ్లను తొలగించినట్లు వెల్లడించారు. ఈ పూర్తివార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. గతేడాది నవంబర్ నుంచి రైతులు దిల్లీ సరిహద్దుల్లోనే శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులు బారికేడ్లను(Barricades removed at ghazipur border) ఏర్పాటు చేసి రోడ్లను మూసివేశారు. కేంద్రం- రైతు సంఘాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి ఫలించలేదు.
ఇవీ చూడండి:'పంటలను అమ్ముకునేందుకు పార్లమెంట్‌కు వెళ్తాం'
రైతులతో కలిసి కబడ్డీ ఆడిన రాకేశ్ టికాయిత్