తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే అధికారంలో తాము భాగస్వామ్యం కోరబోమని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు కేఎస్ అళగిరి స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఎన్నికల్లో 25 సీట్లు కేటాయించటంపై హర్షం వ్యక్తం చేశారు అళగిరి. కాంగ్రెస్కు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సైతం డీఎంకే సానుకూలంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయటంలేదన్నారు అళగిరి. భాజపాను.. దేశానికి పట్టిన జబ్బుగా ఆయన అభివర్ణించారు. ఆ జబ్బును అందరికీ వ్యాప్తి చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
'డీఎంకే గెలిస్తే అధికారంలో భాగస్వామ్యం అడగం'
రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే తాము అధికారంలో భాగస్వామ్యం కోరబోమని స్పష్టం చేశారు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి. కాంగ్రెస్కు 25 సీట్లు కేటాయించటంపై హర్షం వ్యక్తం చేశారు. తమకు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేందుకు సైతం డీఎంకే సానుకూలంగా ఉందన్నారు.
'డీఎంకే అధికారంలో భాగస్వామ్యం అడగం'
రాష్ట్రంలో 'కామ్రాజ్ రాజ్యం' నినాదానికి ప్రాముఖ్యం ఇవ్వటంలేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎన్నికల్లో భాజపాను ఓడించి కామ్ రాజ్ రాజ్యం తీసుకొస్తామన్నారు.
ఇదీ చదవండి :తమిళనాట 25 చోట్ల బరిలో కాంగ్రెస్