ఈసీ ఇచ్చిన నోటీసును లక్ష్యపెట్టేది లేదని బంగాల్ సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. సీఆర్పీఎఫ్ జవాన్లు భాజపాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, వారు అలా చేయడం ఆపేవరకు తాను ఇలానే మాట్లాడతానని స్పష్టం చేశారు. పూర్వ బర్ద్మాన్లోని జమల్పుర్ ర్యాలీలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ చెప్పే ఏ విషయాన్నైనా ఎన్నికల సంఘం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు.
"భాజపాకు అనూకూలంగా సీఆర్పీఎఫ్ వ్యవహరిస్తోంది. ఈసీ పక్షపాతం వీడేంతవరకు నేను ఇలానే మాట్లాడతా. మీ(ఈసీ) నోటీసుల్ని లెక్కపెట్టేదే లేదు."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
"బంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పరీక్ష పే చర్చ నిర్వహించారు. అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు కాదా?" అని మమత ప్రశ్నించారు.