తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగాల్​ ఎన్నికల్లో నెగ్గాక.. దిల్లీలో మార్పు తెస్తాం' - TMC

బంగాల్ సీఎం మమత బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల్లో గెలిచాక.. దిల్లీలో మార్పు తెస్తామన్నారు. పలు ప్రచార సభల్లో పాల్గొన్న దీదీ.. భాజపాపై విమర్శలు గుప్పించారు.

Will bring 'parivartan' in Delhi after winning Bengal polls: Mamata
'బంగాల్​ ఎన్నికల్లో నెగ్గాక.. దిల్లీలో మార్పు తెస్తాం'

By

Published : Mar 19, 2021, 5:02 AM IST

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక దిల్లీలో పరివర్తన్​ (మార్పు) తెస్తామని బంగాల్​ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గురువారం పలు ప్రచార సభల్లో పాల్గొన్న దీదీ.. భాజపాపై ధ్వజమెత్తారు. ఎన్నికలైన తర్వాత దిల్లీలో అడుగుపెడతామన్న భయం కాషాయంపార్టీలో నెలకొందని.. అందుకే పూర్తి బలగంతో తమపై ఆ పార్టీ దాడి చేస్తోందన్నారు.

అయినా భయపడేది లేదని.. బంగాల్ ఎన్నికలయ్యాక దిల్లీలో అడుగుపెడతామని , అక్కడ భాజపా భరతం పట్టడం ఖాయమని దీదీ స్పష్టం చేశారు. బంగాల్​ ప్రజల ఓట్లను దోచుకోవడానికి హెలికాఫ్టర్లు, విమానాల్లో నోట్ల కట్టలను భాజపా దించుతోందని ఆరోపించారు. సీపీఎంకు ఓటు వేయొద్దని వామపక్ష మద్దతు దారులకు విజ్ఞప్తి చేశారు మమతా. ఎట్టిపరిస్థితుల్లోనూ జాతీయ జనాభా పట్టికను(ఎన్​పీఆర్​) అనుమతించే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు.

దిల్లీ సీఎంకు దీదీ లేఖ

దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ. లోక్​సభలో నేషనల్​ క్యాపిటల్​ టెరిటరీ ఆఫ్​ దిల్లీ(సవరణ) 2021 బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటానికి మద్దతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అసోంలో రెబల్స్​కు‌ భాజపా షాక్‌

ABOUT THE AUTHOR

...view details