Wife Leaves Husband: లక్షల రూపాయల అప్పు చేసినప్పటికీ.. కొందరు ఎలాంటి టెన్షన్ లేకుండా జీవించేస్తుంటారు. కానీ ఇక్కడ తన భర్త చిన్న మొత్తంలో రుణం తీసుకున్నప్పటికీ.. అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. కర్ణాటక చామరాజనగర్లో జరిగిందీ ఘటన.
చామరాజనగర్ జిల్లాకు చెందిన శివకుమార్, గుండ్లుపేటెకు చెందిన ప్రేమకు 9 సంవత్సరాల క్రితం వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
Wife leaves husband for debt: కొద్దిరోజుల కిందట శివ ఒకరి దగ్గర 7 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి తన భర్త, పిల్లల్ని వదిలి వెళ్లిపోయింది ప్రేమ. ఆమెను తీసుకొచ్చేందుకు శివ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పు తొందర్లోనే చెల్లిస్తానన్నా అతడి మాట వినలేదు.