Wife Cheating Case on Husband in Hyderabad : యువకుడిని కొద్ది వారాల ముందు పెళ్లి చేసుకోవడమే కాకుండా అతడు కోరుకున్న మరో యువతితో దగ్గరుండి పెళ్లి చేయించిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకొంది. మొదటి భార్య సాక్షిగా.. ఓ యువకుడురెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలియని రెండో భార్య.. పెళ్లి తర్వాత భర్త ప్రవర్తనతో అయోమయానికి గురైంది. అతనెందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలిశాక కంగుతిన్నది. అసలు విషయం తెలుసుకుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు ట్విస్ట్ తెలుసుకుని షాక్ అయ్యారు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే..?
పోలీసుల కథనం ప్రకారం..శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరజాడ గాంధీ (23) బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని సింగాడ కుంటలో ఉంటున్నాడు. కేజీ ఫిల్మ్స్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్‌లో డ్యాన్స్ వీడియోల్లో నటిస్తాడు. 2020లో యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ నృత్యం నేర్చుకునే సమయంలో అక్కడికి శిక్షణ కోసం వచ్చిన యువతి (20)తో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇరువర్గాల పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం చేయడంతో కలిసి సహజీవనం చేస్తున్నారు.
భర్త రెండో పెళ్లి.. కోపంతో ఇంటిని తగలబెట్టిన మొదటి భార్య
Woman Gets Her Husband Married to Another Woman :ఈ క్రమంలోనే.. గాంధీకి రోజా అనే మరో యువతితో సంబంధం ఉందని యువతి అనుమానించడం, ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు పడి అది కాస్త.. పోలీసు కేసు దాకా వెళ్లింది. రోజా, గాంధీ ఇద్దరు తాము మంచి స్నేహితులమని నమ్మించడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. దీంతో మే 14న వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. పెద్దల సమక్షంలో రోజా దగ్గరుండి అన్ని బాధ్యతలను తీసుకొని.. ఆ యువతితో గాంధీ వివాహం జరిపించింది.