తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.2వేల కోసం గొడవ.. భర్తను చావబాది, యాసిడ్ పోసిన భార్య - రెండు వేల కోసం భర్తపై యాసిడ్​ పోసిన భార్య

ప్రేమించి, పెళ్లి చేసుకున్న భర్త పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించింది ఓ మహిళ. రూ.2000 కోసం గొడవపడి.. తన బంధువులతో కలిసి అతడిపై తీవ్రంగా దాడి చేసింది. ముఖంపై యాసిడ్ పోసింది. ఈ ఘటన బిహార్​లోని సీతామఢీ జిల్లాలో మంగళవారం జరిగింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 14, 2022, 7:36 PM IST

wife beaten husband for 2000 rupees : భర్తపై బంధువులతో కలిసి దాడి చేసి, అతడి కళ్లల్లో యాసిడ్ పోసింది ఓ మహిళ. ఈ ఘటన బిహార్​లోని సీతామఢీ జిల్లా షాబాజ్​పుర్​లో మంగళవారం జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాసిడ్ దాడి తర్వాత తన కళ్లు కనిపించడం లేదని చెబుతున్నాడు.
పదేళ్ల క్రితం ప్రేమ వివాహం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరహా గ్రామానికి చెందిన నాగేశ్వర్ సింగ్, షాబాజ్​పుర్​కు చెందిన పార్వతీ కుమారి.. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. రూ.2000 విషయంలో 15 రోజుల క్రితం భార్యాభర్తలకు గొడవ జరిగింది. కోపంతో షాబాజ్​పుర్​లోని పుట్టింటికి వెళ్లిపోయింది పార్వతి. మంగళవారం ఫోన్​ చేసి భర్తను తన స్వగ్రామానికి రావాలని కోరింది.

పార్వతి అమ్మానాన్నల ఇంటికి నాగేశ్వర్ వెళ్లగా.. అక్కడ గొడవ పెద్దదైంది. ఆమె కుటుంబసభ్యులంతా కలిసి నాగేశ్వర్​ను చితక్కొట్టారు. పార్వతి యాసిడ్​తో భర్త ముఖంపై దాడి చేసింది. వెంటనే అతడి కళ్లు కనిపించకుండా పోయాయి.సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన పార్వతి ఇంటికి వెళ్లారు. బాధితుడ్ని తొలుత స్థానిక ప్రాథమిక కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి సీతామఢీలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. తన కళ్లల్లో యాసిడ్ పోశారని నాగేశ్వర్ చెబుతున్నా.. అలాంటి ఆనవాళ్లు లేవని.. అతడికి చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details