- ఎన్నికల ఫలితాల రోజే రాజకీయ హింస
- వేర్వేరు పార్టీల కార్యకర్తలు హత్య
- అధికార, విపక్షాల మాటల తూటాలు
- రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్లు
- కేంద్రం కమిటీలు- మోదీకి మమత లేఖాస్త్రాలు
మే 2 నుంచి బంగాల్లో జరుగుతున్న పరిణామాలివి. ప్రచార పర్వం, పోలింగ్, ఓట్ల లెక్కింపు... ఇలా అన్నీ పూర్తయినా రాజకీయ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. 'బంగాల్ దంగల్'లో విజేత ఎవరో తేలి వారం అయినా... తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అంతకంతకూ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నాయి. తొలి వారమే ఇలా ఉంటే... రానున్న ఐదేళ్లు బంగాల్ రాజకీయం ఎలా సాగనుంది? టీఎంసీ, భాజపా మధ్య పోరు... హైఓల్టేజ్ పొలిటికల్ యాక్షన్ సినిమాను తలపించడం ఖాయమా?
బలమైన అధికార పక్షం వర్సెస్ బలమైన ప్రతిపక్షం
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఎంసీ 213 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని చేపట్టింది. మరోవైపు.. 2016 ఎన్నికల్లో 3 స్థానాలకే పరిమితమైన భాజపా.. అనూహ్యంగా పుంజుకుని ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. మమతా బెనర్జీపై విజయం సాధించిన సువేందు అధికారిని ప్రతిపక్ష నేతగా నియమించాలని భావిస్తోంది భాజపా అధిష్ఠానం.
రాజకీయ హింస..
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే రాష్ట్రం అట్టుడుకుతోంది. రాజకీయ హింస పెరిగిపోయింది. దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్‌పుర్ ప్రాంతంలో హరణ్ అధికారి అనే భాజపా కార్యకర్త హత్యకు గురయ్యాడు. టీఎంసీ కార్యకర్తలే ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కోల్‌కతాలోని బెలెఘటాలో మరో భాజపా కార్యకర్తను దుండగులు హత్యచేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా దత్తాపుకర్లో దుండగులు జరిపిన బాంబు దాడిలో ఐఎల్ఎఫ్ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. ఇది టీఎంసీ నేతల పనే అని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పరస్పర ఆరోపణలు
తృణమూల్ కాంగ్రెస్ దాడుల్లో.. తమ పార్టీ కార్యకర్తలు ఆరుగురు మృత్యువాతపడ్డారని, పలువురు గాయపడ్డారని భాజపా ఆరోపించింది. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నారని పేర్కొంది. ఘర్షణలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో భాజపా పలు వీడియోలను షేర్ చేసింది. నందిగ్రామ్‌లో తమ కార్యాలయంపై దాడి అనంతరం చెల్లాచెదురుగా పడి ఉన్న పోస్టర్లు, పత్రాలు, ధ్వంసమైన సామగ్రి వంటివి ఆ వీడియోల్లో ఉన్నాయి. సుమారు నాలుగు వేల మంది భాజపా మద్దతుదార్ల ఇళ్లను ధ్వంసం చేశారని తెలిపింది. అధికార పార్టీ రాజకీయ హింసకు పాల్పడుతోందని ఆరోపించింది. బంగాల్లో రాజకీయ హింస చెలరేగిన క్రమంలో రాష్ట్రపతి పాలన విధించాలని పలువురు కేంద్ర మంత్రులు, నేతలు కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. మే 2న జరిగిన హింసాత్మక ఘటనల్లో మొత్తం 16 మంది తమ కార్యకర్తలు మరణించారని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. భాజపానే కారణంగా పేర్కొంది. బాధితుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాష్ట్రంలో హింసకు కేంద్ర మంత్రులు ఉసిగొల్పుతున్నారంటూ మమత వ్యాఖ్యానించారు. తాను అధికారంలోకి వచ్చి ఇంకా 24 గంటలు కాకముందే లేఖలు, కేంద్ర బృందాలు రాక వంటివి జరిగిపోతున్నాయని అన్నారు. ప్రజల తీర్పును భాజపా స్వాగతించటం నేర్చుకోవాలని సూచించారు.
నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ..