తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా ట్రయల్స్​​కు వలంటీర్​గా మరో మంత్రి

బంగాల్​ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హద్​ హాకీమ్​ కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​కు సిద్ధమయ్యారు. కోల్​కతాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్​లో టీకా వేయించుకోనున్నారు.

West Bengal minister volunteers for COVID-19 vaccine trial
క్లినికల్​ ట్రయల్స్​​కు వాలంటీర్​గా మంత్రి

By

Published : Nov 26, 2020, 5:58 PM IST

Updated : Nov 26, 2020, 6:04 PM IST

కరోనా టీకాకు సంబంధించిన క్లినికల్​ ట్రయిల్స్​లో పాల్గొనేందుకు బంగా​ల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హద్​ హాకీమ్​ ఆసక్తి చూపించారు. కొవాగ్జిన్​ ముడోదశ క్లినికల్​ పరీక్షల్లో భాగంగా కోల్​కతాలోని 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటెరిక్ డిసీజెస్' ​కు వెళ్లి టీకా వేయించుకోనున్నారు.

ప్రజలకు సాయం చేయాలనుకుంటున్నాను. వారి చికిత్సలో నా సహకారం ఉంది అంటే నాకు చాలా ఆనందం. కొవాగ్జిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. నా వయసు 62ఏళ్లు. అందుకే ముందుగా అధికారులకు సమాచారం ఇచ్చాను. నా ఆరోగ్యం సహకరిస్తుందో లేదో అడిగి తెలుసుకున్నాను.

-ఫిర్హద్​ హాకీమ్​ , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

క్లినికల్​ పరీక్షలకు మంత్రి ముందుకు రావడంపై అక్కడి వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన​ నిర్ణయంతో మరో నలుగురు ప్రేరణ పొందుతారని అన్నారు.

హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ ఇటీవలే కొవాగ్జిన్​ మూడో దశ ట్రయల్స్​లో భాగంగా టీకా వేయించుకున్నారు.

ఇదీ చూడండి: రైతుల నిరసనపై సీఎంల మాటల యుద్ధం

Last Updated : Nov 26, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details