తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సచిన్​ వాజే​ కస్టడీ కోసం కోర్టుకెళ్తాం: ఏటీఎస్​

అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసులో కారు యజమానిగా భావిస్తున్న మన్సుఖ్ హిరెన్ మృతి కేసులో పోలీస్ అధికారి సచిన్​ వాజే పాత్ర ఉందని మహారాష్ట్ర ఏటీఎస్ అధికారి జైజీత్​ సింగ్ తెలిపారు. ఆయన్ను ఏటీఎస్​ కస్టడీకి తరలించటం కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

Waze involved in Hiran murder; will seek his custody:ATS chief
'హిరెన్​ మృతి కేసులో వాజే పాత్ర.. కస్టడీ కోసం కోర్టుకెళ్తాం'

By

Published : Mar 23, 2021, 6:03 PM IST

Updated : Mar 23, 2021, 10:22 PM IST

మన్సుఖ్ హిరెన్​ మృతి కేసులో పోలీసు అధికారి సచిన్​ వాజే పాత్ర ఉందని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్)​ అధికారి జైజీత్​ సింగ్​ తెలిపారు. వాజే.. ఏటీఎస్ కస్టడీ కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తమకు ఆయన కస్టడీ అవసరమని తెలిపారు. ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన వాజే.. ప్రస్తుతం ఎన్​ఐఏ కస్టడీలో ఉన్నారు. మార్చి 25 వరకు ఆయన కస్టడీలో కొనసాగనున్నారు.

దమన్​ దీవ్​లో కారు

హిరెన్ కేసుకు సంబంధించి దమన్​ దీవ్​లో ఓ కారును స్వాధీనం చేసుకుని ఠాణెలోని ఏటీఎస్ కార్యాలయానికి తరలించినట్లు ​ అధికారులు తెలిపారు. ఫోరెన్సిక్​ బృందం కారును పరిశీలిస్తోందన్నారు. ఈ వోల్వో కారుకు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్​ నెంబర్​ ఉందన్నారు. కారు యజమాని ఎవరో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి :'హిరేన్​​ మృతి కేసు కథ ముగిసింది!'

Last Updated : Mar 23, 2021, 10:22 PM IST

ABOUT THE AUTHOR

...view details