తెలంగాణ

telangana

Monsoon: ముంబయిని ముంచెత్తిన వర్షాలు

By

Published : Jun 9, 2021, 11:57 AM IST

కుండపోత వర్షాలతో ముంబయిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ నిలిపేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుర్లా-సాయన్ మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు.

Water stagnated in Mumbai in the first rains
ముంబయిలో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ఆగమనంతో దేశ వాణిజ్య రాజధాని ముంబయి భారీ వర్షాలతో తడిసిముద్దయింది. బుధవారం ఉదయం రుతుపవనాలు మహారాష్ట్రను తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ముంబయి సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముంబయిలో భారీ వర్షాలు

నిన్న రాత్రి 8.30 గంటల నుంచి ఈ ఉదయం 5.30 గంటల వరకు ముంబయిని కొలాబాలో అత్యధికంగా 65.4 మిల్లీమీటర్లు, శాంతాక్రూజ్‌లో 50.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో ఐదు రోజుల పాటు ముంబయి, శివారు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాయ్‌గఢ్‌, ఠాణె, పాల్ఘర్, నాసిక్‌ తదితర జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని తెలిపింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

రహదారులపై నిలిచిన ట్రాఫిక్
రోడ్డుపై నిలిచిన నీటిలో నడుస్తున్న ప్రయాణికుడు

తెలుగు రాష్ట్రాల్లో..

సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్‌ 10న నైరుతి రుతుపవనాలు ముంబయిని తాకుతాయి. అయితే ఈ ఏడాది ఒక రోజు ముందే వచ్చినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, బెంగాల్‌లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు అంచనా వేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

రైళ్లు బంద్​..

రైలు పట్టాలపై నిలిచిన నీరు

పట్టాల మీదుగా నీరు ప్రవహిస్తున్న కారణంగా.. పలు మార్గాల్లో రైలు సేవలు నిలిపేశారు. కుర్లా-సాయన్ మార్గాల్లో రైళ్లను నిలిపేశారు.

ఇవీ చదవండి:కూరగాయల సంచుల్లో వేరే రాష్ట్రానికి లిక్కర్​ స్మగ్లింగ్​!

Submarine: భారత జలాల్లోకి కొత్త 'సొరలు'

ABOUT THE AUTHOR

...view details