తెలంగాణ

telangana

ETV Bharat / bharat

' రెండు సంతకాలు చేస్తే.. రూ.300 కోట్లు ఇస్తామన్నారు'

మేఘాలయ గవర్నర్​ సత్యపాల్​ మాలిక్ (Satyapal Malik News)​ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్​ గవర్నర్​గా ఉన్న సమయంలో ఓ వ్యాపారవేత్త సహా ఆర్ఎ​స్ఎస్​తో అనుబంధం ఉన్న వ్యక్తులకు చెందిన దస్త్రాలపై సంతకాలు పెడితే రూ.300 కోట్లు వస్తాయని కార్యదర్శలు చెప్పారని తెలిపారు.

nawab malik
'సంతకం చేస్తే రూ.300 కోట్లు ఇస్తామన్నారు'

By

Published : Oct 22, 2021, 6:56 AM IST

తన జీవితంలో ఎన్నడూ అవినీతితో రాజీ పడలేదని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ (Satyapal Malik News) తెలిపారు. కొత్తగా నియమితులైన అధికారులతో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన (Satyapal Malik News) పలు విషయాలను వెల్లడించారు. జమ్ముకశ్మీర్​ గవర్నర్‌గా ఉన్న సమయంలో రెండు దస్త్రాలపై సంతకాలు పెడితే రూ.300 కోట్లు వస్తాయని తన కార్యదర్శులు చెప్పారన్నారు నవాబ్​ మాలిక్​.

"దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆర్​ఎస్​ఎస్​తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థల దస్త్రాలివి. ఒత్తిళ్లకు భయపడదలచుకోలేదు వాటిని తిరస్కరించాను. ఈ అవినీతి వ్యవహారాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన నా నిర్ణయాన్ని సమర్ధించారు. అవసరమైతే పదవిని వీడేందుకు ఆ సమయంలో సిద్ధపడ్డాను" అని మాలిక్‌ వెల్లడించారు. మాలిక్‌ ప్రసంగ వీడియో సామాజిక మాధ్యమాల్లో (Satyapal Malik News) చక్కర్లు కొడుతోంది.

ఇదీ చూడండి :కశ్మీర్​లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. బైక్​ల స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details