తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ ఆరో విడత పోలింగ్ ప్రశాంతం.. 53% ఓటింగ్ - ఉత్తర్​ప్రదేశ్ ఆరో విడత ఎలక్షన్లు

UP assembly elections 2022: యూపీలో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పది జిల్లాల్లోని 57 స్థానాలకు గురువారం ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం 5గంటల వరకు 53.31 శాతం పోలింగ్ నమోదైంది.

UP Election 2022
UP Election 2022

By

Published : Mar 3, 2022, 6:03 PM IST

UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​ పూర్వాంచల్​ ప్రాంతంలోని 57 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పది జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటల వరకు 53.31శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

UP Election sixth phase

గోరఖ్​పుర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ​ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. కన్యా నగర్​ క్షేత్రలోని పోలింగ్​ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు గోరఖ్​నాథ్​ ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఎన్నికల్లో భాజపాకు 80 శాతం ఓట్లు వస్తాయని యోగి చెప్పుకొచ్చారు. విపక్షాలు మిగిలిన 20 శాతం ఓట్లను పంచుకుంటాయని అన్నారు.

ఓటింగ్ జరిగిన 10 జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ప్రధానంగా భాజపా, ఎస్పీ కూటముల మధ్యే పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన యోగి

కీలక నేతలు

  • యోగి ఆదిత్యనాథ్- యూపీ ముఖ్యమంత్రి-- గోరఖ్​పుర్ అర్బన్
  • కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ-- తమ్కుహీ రాజ్
  • మాజీ మంత్రి, ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య-- ఫాజిల్​నగర్
  • అసెంబ్లీలో విపక్ష నేత రామ్ గోవింద్ చౌదరి-- బాంసిడీ

గత ఎన్నికల్లో ఇలా..

2017లో జరిగిన ఎన్నికల్లో ఈ 57 స్థానాల్లో భాజపా కూటమిదే ఆధిపత్యం. మొత్తం 46 స్థానాల్లో భాజపా విజయం సాధించింది.

ఇదీ చదవండి:'ఆ పార్టీలకు ఇప్పటికీ మాఫియాతో లింకులు!'

ABOUT THE AUTHOR

...view details