తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలిలిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ పేరు.. ఓటర్ల జాబితాలో కనిపించకపోవడం కలకలం రేపింది. తమిళనాడు అసెంబ్లీ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రెండు దశాబ్దాలుగా థౌజండ్ లైట్స్ నియోజకవర్గ పరిధిలో శశికళకు ఓటు హక్కు ఉంది. అయితే.. పోయెస్ గార్డెన్‌లోని ఆస్తులను జప్తు చేశాక.. అక్కడ నివసించే శశికళ, ఇలవరసి తదితరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి చెన్నై కార్పొరేషన్ తొలగించినట్లుగా తెలుస్తోంది.