తమిళనాడు వెల్లూరు జిల్లా ఎస్పీ సమయస్ఫూర్తి ప్రదర్శించారు. కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
టాటూలు వేస్తూ జీవనం సాగిస్తున్న సతీష్(21) రోజూమాదిరిగానే వెల్లూరులోని గ్రీన్ సర్కిల్ ప్రాంతంలో పనిచేసుకుంటున్నాడు. ఆ సమయంలో సెల్వన్ పట్టి ప్రాంతానికి చెందిన కిషోర్, మరో ఇద్దరు యువకులు సతీష్‌ను కత్తులతో బెదిరించారు. బాధితుని వద్ద నుంచి బలవంతంగా రూ.1200 వసూలు చేశారు. అదే సమయంలో స్థానిక ఎస్పీ సెల్వ కుమార్ కారులో ప్రయాణిస్తూ ఈ ఘటనను చూశారు. వెంటనే కారు ఆపి దోపిడీకి పాల్పడినవారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. దీంతో ఎస్పీ సెల్వ కుమార్‌పై స్థానికులు ప్రశంసలు కురిపించారు.