Young man running in Noida: ఓ యువకుడు అర్ధరాత్రి నోయిడా రహదారులపై ఆగకుండా పరిగెత్తుతున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒళ్లంతా చెమటలు పట్టినా.. దారిన వెళ్లేవారు లిఫ్ట్ ఇస్తామని చెప్పినా.. తన పరుగు ఆపకుండా వెళ్తున్న ఆ యువకుడి కథ విని నెటిజన్లు ఔరా అంటున్నారు.
అసలు ఆ యువకుడి కథేంటంటే?
Vinod Kapri viral tweet: ప్రముఖ డైరెక్టర్ వినోద్ కాప్రీ.. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో.. నోయిడా రహదారిపై తన కార్లో వెళ్తుండగా.. ఓ యువకుడు రోడ్డుపై పరిగెత్తుతూ కనిపిస్తాడు. ఎందుకు పరిగెడుతున్నావ్? అని యువకుడిని అడుగుతాడు. లిఫ్ట్ ఇస్తానంటే సున్నితంగా తిరస్కరిస్తాడు. వీటితో పాటు పలు ప్రశ్నలకు యువకుడు చెప్పిన సమాధానాలు విని.. 'నువ్వో బంగారం' అంటూ యువకుడిని డైరెక్టర్ మెచ్చుకుంటాడు. దీంతో పాటు మరికొన్ని ప్రశ్నలకు ఆ యువకుడు చెప్పిన సమాధానాలు విని.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.
వినోద్ కాప్రీ: ఇక్కడకు రా.. నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపేస్తాను
యువకుడు:లేదు లేదు. నేను ఇలాగే పరిగెత్తుకుంటూ వెళ్తా.
వినోద్ కాప్రీ: ఎందుకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నావ్? ఎక్కడ పనిచేస్తావ్?
యువకుడు:నేను పరిగెత్తుకుంటూనే వెళ్తా. సెక్టార్ 16లోని మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తా. పరిగెత్తేందుకు నాకు ఇప్పుడే సమయం దొరుకుతుంది. ఆర్మీలో చేరేందుకు నేను పరిగెడుతున్నా. పొద్దున పరిగెత్తేందుకు నాకు సమయం దొరకదు. ఇంట్లో వంట, ఇతర పునులు పూర్తి చేసుకొని మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది.