తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నాన్-వెజ్ ఫుడ్​ను బయటకు కనిపించేలా ఉంచొద్దు!' - నాన్ వెజ్ ఫుడ్ న్యూస్

వీధి వ్యాపారులు నాన్ వెజ్ ఆహార పదార్థాలను(non veg food) బహిరంగంగా కనిపించేలా విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేసింది గుజరాత్​లోని వడోదరా మున్సిపల్ కార్పొరేషన్. పలువురు మహిళలు, చిన్నారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వడోదరా డిప్యూటీ మేయర్ నందా జోషి చెప్పారు.

VADODARA NON VEG DISPLAY
VADODARA NON VEG

By

Published : Nov 13, 2021, 12:49 PM IST

Updated : Nov 13, 2021, 1:59 PM IST

స్ట్రీట్ ఫుడ్ స్టాళ్లు, రెస్టారెంట్లు నాన్ వెజ్ వెరైటీలను (Vadodara non veg restaurant ) బయటకు కనిపించేలా విక్రయానికి ఉంచడంపై గుజరాత్​లోని వడోదరా మున్సిపల్ కార్పొరేషన్ (Vadodara Municipal Corporation) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆహార పదార్థాలను(non veg food) సరిగ్గా కప్పి ఉంచాలని నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్డుపై వెళ్లే వారికి మాంసాహారం కనిపించకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది.

వడోదరాలోని ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్
బహిరంగంగా కనిపించేలా ఉంచిన నాన్​ వెజ్ వెరైటీలు

"నాన్ వెజ్ ఆహారాన్ని అందరికీ కనిపించేలా ఉంచడంపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. వీధి వ్యాపారులు నాన్ వెజ్ ఆహారాన్ని బహిరంగంగా వండుతున్నప్పుడు.. తమ కళ్లలో దురద వంటి సమస్య వస్తోందని కొంతమంది మహిళలు, చిన్నారులు ఫిర్యాదు చేశారు. ఆహారాన్ని సరిగ్గా కప్పి ఉంచాలని మేయర్ నోటిఫికేషన్ జారీ చేశారు."

-నందా జోషి, వడోదరా డిప్యూటీ మేయర్

ప్రస్తుతానికి నియమాలపై నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశామని నందా జోషి తెలిపారు. వీటిని అమలు చేయడంపై సంబంధిత వర్గాలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చదవండి:బస్సులో పాటలు పెడితే.. ఇక గెట్​ అవుటే!

Last Updated : Nov 13, 2021, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details