ఉత్తర్‌ప్రదేశ్ హాపుడ్‌లోని ఆదర్శ్‌నగర్ కాలనీకి గత మూడేళ్ల నుంచి రోడ్లు, డ్రైనేజీ సదుపాయం లేదు. ఎక్కడో పైపులైను పాడై.. సరిగ్గా తాగు నీరు కూడా రావటం లేదు. ఎన్నోసార్లు అధికారులకు మొర పెట్టుకున్నారు. కానీ వాళ్లు కనికరించలేదు. చివరి ప్రయత్నంగా ఇదిగో ఇలా "ఇల్లు అమ్ముతాం ఎవరైనా కొనండి, ఇక్కడ ఉండలేకపోతున్నాం," అని ఇంటి మీద రాసుకున్నారు.
"మా గ్రామం ఇంత వరకు అభివృద్ధి చెందలేదు. ఈ కాలనీకి రోడ్డు సదుపాయం లేదు. తాగునీటి వసతి లేదు. డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. మా కాలనీలో పరిస్థితి ఇదీ.. పరిష్కరించడని ఎన్నోసార్లు నగరపంచాయతీకి విన్నవించాం, ధర్నాలు చేశాం. అయినా వారు పట్టించుకోలేదు. మా కాలనీలో సమస్యల్ని పరిష్కరించకుంటే..ఇళ్లు అమ్ముకుని ఎక్కడికైనా వెళ్లిపోతాం."
-రాముల్ సింగ్, హాపుడ్, ఆదర్శ్‌నగర్ కాలనీవాసి
"వర్షంపడితే ఇక్కడంతా బురద పేరుకుపోతుంది. ఇంటి ముందు మురునీరు చేరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. అధికారులకు చెప్పినా పట్టించుకోరు. వేరే కాలనీలో రోడ్లు వేస్తారు కానీ ఇక్కడ వేయరు."