Uttar Pradesh electricity rate cuts: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ రేట్లలో కోత విధించింది. రైతులకు ప్రయోజనం కలిగేలా బోరు బావుల విద్యుత్ ధరలను తగ్గించింది. పట్టణాల్లో మీటరు ఉన్న బోరుబావుల కనెక్షన్ల యూనిట్ ధరను రూ.6 నుంచి రూ.3కు.. గ్రామీణ మీటర్ల పంప్ కనెక్షన్ల యూనిట్ ధరను రూ.2 నుంచి రూ.1కి పరిమితం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
UP Electricity bills
పట్టణాల్లో ఫిక్స్డ్ ఛార్జీల రేటు హార్స్‌పవర్‌కు రూ.130 నుంచి రూ.65కు... గ్రామాల్లో రూ.70 నుంచి రూ.35కు తగ్గించింది. మీటర్లు లేని కనెక్షన్లకు రేటును హార్స్‌పవర్‌కు రూ.170 నుంచి రూ.85కు పరిమితం చేసింది.
Yogi Adityanath news
'రైతులు ఆనందంగా ఉంటేనే ఉత్తర్‌ప్రదేశ్ స్వయం సమృద్ధి సాధ్యమవుతుంది. అందుకే రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా 50 శాతం రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నాం' అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. యోగి సర్కార్ నిర్ణయం వల్ల యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌పై రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనుంది.
ఏడు విడతల్లో
దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈసీ శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్చేయండి.
ఇదీ చదవండి:ఈసీ ఎన్నికల షెడ్యూల్‌పై ఏ పార్టీలు ఏమన్నాయంటే?